టీవీ9 ఛానల్ ప్రతినిధులకు నర్సాపురం ఎంపీ రఘురామరాజు లీగల్ నోటీసు పంపారు. మే14 వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేసిన సందర్భంగా టీవీ9లో తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అక్రమమైన,నిరాధార కథనాలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. దానికి గాను టీవీ9 డైరెక్టర్ జె.జగపతిరావు, సీఈవో బరుణ్ దాస్, మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్,ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణలు తనకు అన్ కండిషనల్ అపాలజీ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు రఘురామరాజు తరఫున హైకోర్టు అడ్వకేట్ పివిజి ఉమేష్ చంద్ర వారు ప్రచారం చేసిన కథనాలు తదితర వివరాలతో లీగల్ నోటీసు పంపారు.
Must Read ;- మరో వివాదంలో సీఐడీ.. రఘురామరాజు ఫోన్ నుంచి మాజీ సలహాదారుకు మెసేజ్‌లు













