ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందును ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి రూ.120 కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
కృష్ణపట్నం సీవీఆర్ కాంప్లెక్సులో ఆనందయ్యతో పెద్ద ఎత్తున మందు తయారు చేయించుకుని వైసీపీ నేతలు తరలించుకుపోతున్నారని ఆయన ఆరోపించారు.ముందుగా ఆన్ లైన్ ద్వారా రూ.120కే మందు ఇంటికే పంపిస్తామని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి, కోటి మందికి అమ్మడం ద్వారా రూ.120 కోట్లు కాజేసేందుకు ప్లాన్ వేశాడని ఆయన ధ్వజమెత్తారు. ఆనందయ్య మందు పంపిణీకి వెబ్ సైట్ తయారు చేయించి, అందులో సీఎం, ఎమ్మెల్యే ఫోటోలు పెట్టుకున్నారని, ఆనందయ్య ఫోటో లేకుండా చేశారని, విమర్శలు రావడంతో వెబ్ సైట్ నిలిపి వేశారని చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గానికే ముందు..
ముందుగా ఆనందయ్య తయారు చేస్తున్న మందును సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఆనందయ్య సోమవారం పంపిణీ చేయబోయే మందుల ప్యాకెట్లపై కూడా సీఎం జగన్,ఎమ్మెల్యే కాకాణి ఫోటోలు ముద్రించుకున్నారనే సమాచారం వస్తోంది.అయితే ఆన్ లైన్ ద్వారా మందు సరఫరా చేసేందుకు ఆనందయ్య అంగీకరించక పోవడంతోనే ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆనందయ్య మందు తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Must Read ;- చేతులెత్తేసిన ప్రభుత్వం : ఆనందయ్య మందు పంపిణీ ప్రశార్థకం











