నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైన దగ్గరనుండి, ఎక్కడ అడుగు పెట్టిన అంతా శుభమే జరురుగుతుంది. ఆయన పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ వర్షాలు ఆయన వెంటే ఉన్నాయ్. ఆయన పాదయాత్ర ఏ జిల్లాలోకి ఎంటర్ అయితే ఆ జిల్లాలో వరుణ దేవుడు కరుణిస్తున్నాడు. లోకేష్ పాదయత్రకి వరుణ దేవుడు జల్లులు కురిపిస్తూ స్వాగతం పలుకుతూనే ఉన్నాడు..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒంగోలు నగరానికి చేరుకున్నది . సోమవారం రాత్రి సంతనూతలపాడు శివారులో బస చేసిన లోకేష్అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి సంతనూతలపాడు, ఎండ్లూరు డొంక, పేర్నమిట్టల మీదుగా రాత్రి ఒంగోలులోకి ప్రవేశించారు…
బుధవారం సాయంత్రం నగరంలోని ప్రధాన వీధుల్లో సుమారు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసారు. బుధవారం నాడు కూడా ముందురోజు కురిసిన వర్షం కురుస్తుండడంతో యువజన కవాతు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నిర్ణీత సమయానికి 4 గంటలకు, లోకేష్ పాదయాత్ర ఒంగోలు శివారులోని మహాలక్ష్మి కల్యాణమండపం సమీపంలోని వసతి గృహం నుండి ప్రారంభమైంది. మంగమూరు రోడ్డులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ, ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా బారులు తీరారు, డివైడర్లపైకి ఎక్కి ఉల్లాసంగా గడిపారు. ఒంగోలులో జరిగిన యువగళం బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం, లోకేష్ నడిచిన రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వాగత ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం అంతా ప్రశాంతంగా సాగింది.
అభివృద్ధి చేయడంలో జనార్దన్ అందరికంటే ముందుంటాడు అని లోకేష్ కొనియాడారు. ఈనేపథ్యంలో అన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఒంగోలు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు.. ఇక్కడి టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ క్షేత్రస్థాయి క్యాడర్‌ను కూడా సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలో డివిజన్ స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. ఒంగోలు మండల నాయకులతో సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా ఏర్పాట్ల బాధ్యతలను వారికి అప్పగించారు ఒంగోలులో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని, నాలుగేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో కుదేలైందని విమర్శించారు. ఒంగోలులో అయినా, ఒడిశాలో అయినా టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిని, పట్టుకుని బాధ్యులను పోలీసులకి అప్పచెప్తాం అని లోకేశ్ హెచ్చరించారు.
సాయంత్రం సభా ప్రాంగణం ఉన్న మంగమూరు రోడ్డుకు చేరుకోగా అనూహ్యంగా వర్షం కురిసింది. లోకేశ్ వేదికపైకి రాగానే జనం కిక్కిరిసిపోయి, కనుచూపు మేరలో జనంతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల భవనాలన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇక, లోకేష్ ప్రసంగానికి సానుకూల స్పందన రావడంతో సభా ప్రాంగణమంతా ఉత్సాహంగా మారింది. సభా ప్రాంగణంలో 15 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేయగా, ఆ సంఖ్య దాదాపు 30 వేలకు చేరుకుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలులోని పలు డివిజన్లలో మహిళా నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ లోకేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో ఒంగోలు నగరాన్ని పసుపుమయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా లోకేశ్ పాదయాత్ర సాగే మార్గంలో పలు చోట్ల నేతలు ఫ్లెక్సీలు, ఇతర రూపాలతో భారీగా అలంకరిస్తున్నారు.