వైసీపీ సామాజిక మాధ్యమాల్లో వక్రీకరణ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అది మరింత విపరీతంగా మారుతోంది. వైసీపీలో రకరకాల గ్రూపులు ఏర్పడి… అధినేత దృష్టిలో పడేందుకు ఒకరి కంటే ఒకరు ఎక్కువ అన్నట్లుగా నాసిరకం పనులతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా ‘వైసీపీ ఐటీ వింగ్’ ఏర్పాటైంది. లక్ష మందితో సైన్యాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఐటీ వింగ్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ సైన్యంతో యుద్ధం మొదలు పెట్టబోతున్నారని సమాచారం..
రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి సభ్య సమాజం తలదించుకునేలా అనైతిక దాడులకు వైసీపీ సోషల్ మీడియా ‘ట్రిపుల్ ఎం’ ఫార్ములాను అమలు చేస్తోంది. అంటే… మార్ఫింగ్, మిక్సింగ్, మేకింగ్ ‘డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఏదో ఒకటి లేనట్లుగా వీడియోలు రూపొందించి ప్రజలకు విడుదల చేస్తున్నారు. ఏది నిజం.. ఏది తప్పు.. తెలిస్తే నష్టం జరుగుతుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కొందరు వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు సైలెంట్ గా పక్కకు తప్పుకుంటున్నారు. మీరు సోషల్ మీడియాలో మీమ్స్ చేయవచ్చు. కానీ… ఇది చాలా అరాచకం!మేము ఈ పాపం చేయలేము” అని కొంతమంది కంటెంట్ రచయితలు వైసీపీ సోషల్ మీడియాను వదిలివేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌కి మైండ్ బ్లాక్ అయింది.. చెల్లింపులకు, భవిష్యత్తుకు నేనే గ్యారెంటీ అని వేడుకున్న ఆడియో వైరల్ అవుతోంది. ముందుగా వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి మరియు ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు..
అయితే ఈ మద్యే సజ్జల రామకృష్ణ రెడ్డి సుమన్ టీవీ ఓనర్ ని కలవడం సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రతిపక్షం మీద విషం చిమ్మడానికి మరో విష పాముతో జత కట్టబోతున్నాడని సమాచారం. సుమన్ టీవీ తో వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేట్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. సుమన్ టీవీ తో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల రామకృష్ణ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడని తెలిసాక, వైసీపీ వచ్చే ఎలక్షన్ కోసం ఏమైనా చేయడానికి వెనకాడబోదని అర్ధమవుతుంది.. టీడీపీ మీదకి విష ప్రచారం మొదలు పెట్టడం ఇక మిగిలిందని తెలుస్తోంది. వైసీపీ ఇలా అయిన సొంత డబ్బా కొట్టుకోవనివ్వండి అని టీడీపీ శ్రేణులు అంటున్నారు..