April 20, 2026 8:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లిక్కర్‌ స్కామ్‌.. బిగ్‌ బాస్‌ స్కామ్‌, స్కీమ్‌ లీక్‌ చేసిన కేసీరెడ్డి..!

April 25, 2025 at 4:30 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో లిక్కర్‌ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్‌లో అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి నాటి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డేనని సిట్ దర్యాప్తులో తేలింది. లిక్కర్ సప్లై చేసే కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి…ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్‌కే చేర్చేవారని సిట్‌ దర్యాప్తులో గుర్తించింది. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరుడైన వై.ఎస్‌.అనిల్‌రెడ్డి (జగన్‌ పెదనాన్న వై.ఎస్‌.జార్జిరెడ్డి రెండో కుమారుడు), భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్న, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్‌కు అందజేసేవారని నిర్ధారించింది.

2019-24 మధ్య ఇలా రూ.3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేశారని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు (A1) రాజ్‌ కెసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్‌ ప్రకాశ్‌ (A8)ను సిట్‌ అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడలోని ACB స్పెషల్‌ కోర్టులో హాజరుపరుచగా..14 రోజుల పాటు రిమాండు విధించారు. సిట్‌ అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు రిపోర్టులో ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన వివరాలన్నింటినీ పొందుపరిచారు.

బేస్‌ ప్రైజ్‌పై 20 శాతం కమీషన్‌ –

నంద్యాలలోని SPY అగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి (A6).2019లో హైదరాబాద్‌లో డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని.. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే నష్టపోతారని బెదిరించారు. దీంతో పలు డిస్టిలరీల ప్రతినిధులు బేసిక్‌ప్రైస్‌పై 12 శాతం ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ మొత్తాన్ని 20 శాతానికి పెంచేశారు. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెలా సగటున రూ.50-60 కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజ్‌ కెసిరెడ్డి బృందానికి అందజేసేవి. ఆయన ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, వై.ఎస్‌.అనిల్‌రెడ్డికి చేర్చేవారు. వారంతా ఈ సొత్తును జగన్‌కు బదలాయించేవారు. అదాన్, లీలా డిస్టిలరీలకు నిబంధనలు ఉల్లంఘించి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఆ బ్రాండ్ల మద్యమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించేవారు. విశాఖ డిస్టిలరీ, పీఎంకే డిస్టిలరీ, ఎస్‌పీవై డిస్టిలరీ, ఎంబీడీఎల్‌ డిస్టిలరీల ప్రాంగణాలు, యంత్రాల్ని అదాన్, లీలా డిస్టిలరీలు సబ్‌లీజు పేరిట మద్యం బ్రాండ్లు తయారు చేసేవి.

ఎంపీ మిథున్‌రెడ్డి కంపెనీలోకి రూ.5 కోట్లు

నంద్యాలలోని SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో.. సన్‌హోక్‌ ల్యాబ్స్, డీకార్ట్‌ లాజిస్టిక్స్‌ (ఏ16, రాజ్‌ కెసిరెడ్డి బినామీ సంస్థ), ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ మధ్య రూ.60 కోట్ల మేర రూటింగ్‌ జరిగినట్లు తేలింది. డీకార్ట్‌ లాజిస్టిక్స్‌ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించగా.. 2021 అక్టోబరు 3న ఆ సంస్థ ఖాతా నుంచి PLR ప్రాజెక్ట్స్‌ ఖాతాలోకి రూ.5 కోట్లు జమయ్యాయి. డీకార్ట్‌ లాజిస్టిక్స్‌ అనేది ఒక అనుమానాస్పద సంస్థ. PLR ప్రాజెక్ట్స్‌ వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి చెందినది. ఆయన మద్యం కుంభకోణం కుట్రలో భాగస్వామి. అలాంటి వ్యక్తికి చెందిన కంపెనీ ఖాతాలోకి అనుమానాస్పద సంస్థ ఖాతా నుంచి నిధులు వెళ్లాయి. ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే..ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా? క్విడ్‌ ప్రోకోనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అదాన్‌ డిస్టిలరీస్‌ రూ.732 కోట్లు..లీలా డిస్టిలరీస్‌ రూ.454 కోట్లు

అదాన్‌ డిస్టిలరీస్‌ రాజ్‌ కెసిరెడ్డి, విజయసాయిరెడ్డిలదే. అందులో డైరెక్టర్లుగా ఉన్న కాశీచయనుల శ్రీనివాస్‌..విజయసాయిరెడ్డి ప్రతినిధి. ముప్పిడి అనిరుధ్‌రెడ్డి రాజ్‌ కెసిరెడ్డి ప్రతినిధి. 2020లో రూ.60 కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌తో అదాన్‌ డిస్టిలరీస్‌ ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్‌చంద్రారెడ్డి (దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో సంస్థ యజమాని) ఖాతాల నుంచి కాశీచయనుల శ్రీనివాసుల ఖాతాలోకి వర్కింగ్‌ క్యాపిటల్‌ సొమ్ము మళ్లించారు. దీని వెనక ఉన్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు సిట్ అధికారులు. అదాన్‌ డిస్టిలరీస్‌ 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య మూడేళ్లలో రూ.732 కోట్ల మేర వ్యాపారం చేసింది. రాజ్‌ కెసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ 2022 జూన్‌ నుంచి 2024 మార్చి మధ్య మూడేళ్లలో రూ.454 కోట్ల మేర వ్యాపారం చేసింది.

ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సహకారంతో కుంభకోణం

2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి , ప్రభుత్వ అధికారుల సహకారంతో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. దీని వెనక భారీ కుట్ర ఉంది. దాన్ని వెలికితీస్తున్నామన్నారు అధికారులు. ఈ సిండికేట్‌లో రాజ్‌ కెసిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మరికొందరు కీలక భాగస్వాములని చెప్పారు. ఈ మద్యం సిండికేట్‌ సభ్యులు వారి అధికారిక హోదాను, పరపతిని ఉపయోగించుకుని అనుచిత లబ్ధి పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల మేర నష్టం కలిగించారు. ఈ మద్యం సిండికేట్‌ గ్రూపు.. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ పరపతి ఉపయోగించుకుంది. భారీ మొత్తాల్లో సొమ్ములు ‘కీ పొలిటికల్‌ ఫంక్షనరీస్‌’ APSBCL అధికారులకు చెల్లించారు.

ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ ప్రభుత్వ దుకాణాల్లో లభించకపోవటం పట్ల వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమైనా సరే అప్పట్లో ప్రభుతాన్ని నడిపించిన రాజకీయ నాయకులు, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలూ తీసుకోలేదు. ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్ల మద్యమే ప్రభుత్వ దుకాణాల్లో లభించేది. వినియోగదారులు కోరిన బ్రాండ్లేవీ ఉండేవి కాదు. APSBCL ప్రమోట్‌ చేస్తున్న బ్రాండ్ల నాణ్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. నాటి అధికార పార్టీకి సంబంధించిన ‘అత్యున్నత పొలిటికల్‌ ఎగ్జిక్యూటివ్‌’ మద్దతు లేకుండా ఇది ఏ మాత్రం సాధ్యం కాదన్నారు సిట్ అధికారులు.

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు కిక్‌ బ్యాక్స్ చెల్లించేందుకు అనేక పద్ధతులు అనుసరించేవి. మద్యం కొనుగోలుకు సంబంధించి APSBCL నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ కాగానే.. ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవి. వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్‌ వాయిస్‌లు పొందేవి. ఆ వ్యాపారులు కమీషన్‌ మినహాయించుకుని మిగతా డబ్బును రాజ్‌ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, వారి అనుచరులకు చెల్లించేవారు. సిట్‌ దర్యాప్తులో ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు అనేకం బయటపడ్డాయి.

Tags: andhra pradeshap latest newsap liquor scamAP liquor scam case updatesAP liquor scam latest newsap politicsleonewsleotopRaj KasireddyRaj Kasireddy Exposes YS Jagan Role in AP Liquor ScamRaj Kasireddy latest newsys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

పెద్దిరెడ్డి పాపం పండింది.. పుంగనూరులో తొలి వికెట్‌ డౌన్‌..!

Next Post

అండమాన్‌లో ఎగిరిన టీడీపీ జెండా..!

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

జగన్‌ అవినీతి గనుల అధికారి కోసం ఏసీబీ వేట..!!

YS Jagan can get enormous fame with Tirumala Declaration

దిగజారిపోతున్న జగన్..

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist