తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న వార్తలపై తాజాగా తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి భావోద్వేగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే ‘అభిమానులు, ప్రజలే తన దేవుళ్ళని, వారి కోసం తాను ఏమైనా చేస్తానని. వారికి నిజనిజాలు చెప్పాల్సిన అవసరం తనపై ఎంతైనా ఉందని.. ప్రజలు పడుతున్న కష్టం చూడలేక రాజకీయ పార్టీ స్థాపించి సేవ చేద్దామని నిర్ణయం తీసుకున్నానని, . పార్టీకి సంబంధించిన ప్రకటన కూడా చేశానని, . మదురైలో అక్టోబర్ 2వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ పేరును, జెండాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నానని. కానీ అదే సమయంలో దేశంలో కరోనా ఎంటర్ కావడంతో బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని అని లేఖలో తెలిపారు.
ఇంకా తన ఆరోగ్యం గురించి అభిమానుల గురించి వివరిస్తూ.. మరింతగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘2011వ సంవత్సరంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని. వైద్యం కోసం సింగపూర్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నానని. కొన్ని సంవత్సరాల పాటు తన ఆరోగ్యం బాగానే ఉందని, మళ్ళీ 2016లో కిడ్నీ సమస్య రావడంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నానని. ఈ విషయం తన సన్నిహితులకు తప్ప అభిమానులకు, ప్రజలకు తెలియదని పేరొన్నారు. కిడ్నీ మార్పిడి వలన తనకు రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుందని. అందుకనే ఈ కరోనా టైంలో తాను ఎవరిని కలవలేదని,. పార్టీ పెట్టాలన్నా, రాజకీయాలు చేయాలన్నా అనేకమందిని కలవాలని మెన్షన్ చేశారు. కాని ప్రస్తుత సమయంలో అది కుదరని పనని. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని. అలాగని తనకు ప్రాణభయం లేదని, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం వెనుకడగు వేయాల్సి వస్తుందని, రాజకీయ పార్టీ పెట్టాలంటే వచ్చే ఏడాది జనవరి 5వ తేది లోపులోనే పెట్టాలని చెప్పారు. అంటే డిసెంబర్ నెలలోగా తాను ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని. తన రాజకీయ జీవితం కోసం తాను సుధీర్ఘంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు, అభిమానులు స్వాగతిస్తారని ఆశిస్తున్నాను అంటూ రజనీకాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.