ఈ భూమ్మీద ప్రతి జీవికీ ఓ టేస్ట్ ఉంటుంది.. అలాంటప్పుడు ఆర్జీవీకి.. అదేనండీ మన రాంగోపాల్ వర్మకు కూడా అలాంటి టేస్ట్ ఉండటంలో తప్పేముంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంటారు. నైనా గంగూలీ అనే పక్షి ఆర్జీవీ గూటికి ఎలా చేరుకుందోగానీ ఈరోజు ఆర్జీవీ షేర్ చేసిన ఆమె ఫొటోలు మాత్రం కేక ఒక్కటే కాదు కుర్రకారులో కాక కూడా రేపుతున్నాయి. ‘వంగవీటి’ సినిమాతో నైనా గంగూలీని తెలుగులో పరిచయం చేశారు ఆర్జీవీ. అందులో ఆమె రత్నకుమారి పాత్ర చేసింది. ఆ సినిమాలో కూడా ఆమెతో కేక పుట్టించాలనుకున్నా స్క్రిప్టు పరిమితులు దృష్ట్యా ఆర్జీవీకి సాధ్యం కాలేదు. ఆమెను ఆర్జీవీ ఎలా చూడాలనుకున్నారో ఈరోజు ఆయనకు సాధ్యమైనట్టుంది.. అందుకే ఆమె హాట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందాల ఆరబోతకు ఆమె ఏ మాత్రం వెనకాడదని ఈ ఫొటోలు చూస్తుంటేనే అర్థమవుతోంది కదూ. ‘వంగవీటి’ తర్వాత ఆమె మరికొన్ని సినిమాల్లో చేసింది. ఇప్పుడు ఆర్జీవీ ఈ ఫొటోలు షేర్ చేయడంలో ఆంతర్యం ఏమిటో ఆయనే చెప్పాలి. ఇంతకుముందు అనేక ఇంటర్వ్యూలలో యాంకర్లను కూడా ఆయన ఓ ఆట ఆడుకున్నారు. ‘ఏంటండీ అలా చూస్తున్నారు?’ అని యాంకర్ అంటే ‘నీ థైస్ బాగున్నాయి’ అంటాడు. పైగా ఆడదాని అందాన్ని వర్ణించడం ఎవరి వల్లా కాదనేది ఆయన అభిప్రాయం. యద్భావం తద్భవతి అంటారు.
ఈరోజు ఆయన షేర్ చేసిన నైనా గంగూలీ ఫొటోలను చూస్తే ఆయన పర్ సెప్షన్ కొందరికే అర్థమవుతుంది. ఓ ఫొటోలో నైనా ఇచ్చిన పోజులో నీడను చూస్తే మనకు వేరేలా కనిపిస్తుంది. బహుశా ఆర్జీవీ కూడా ఆ నీడనే చూసి ఆ ఫొటో షేర్ చేశారేమో. నటన పరంగా చూసినా నైనా తక్కువదేమీ కాదు. జోహార్ సినిమాలో ఇరగదీసింది. మరి ఇప్పుడేం ఇరగదీయబోతోందోగాని ఈ ఫొటోలు చేసే రచ్చ మాత్రం మామూలుగా లేదు.
Naina Ganguly : ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు.
Naina Ganguly : ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు.
Naina Ganguly : ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు.