అటు బుజ్జి పాపాయి ఎదుగుదలకు.. ఇటు తల్లి ఆరోగ్యానికి తోడ్పడుతాయి ‘తల్లి పాలు’. పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా తల్లిపాలు ఎంతగానో తోడ్పడుతాయి. చిన్నతనంలో తల్లిపాలు తాగినవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందనేది పరిశోధనలు ద్వారా తెలుస్తుంది. అంతేకాదు.. తల్లిపాల ద్వారా ఎన్నో పోషకాలు పిల్లలకు అందుతాయి. అవి వారు భవిషత్తులో ఎటువంటి షోషకాహార లోపం లేకుండా పెరగడానికి ఎంతో ఉపకరిస్తాయి. మరి పిల్లలు ఎదిగేకొద్దీ వారికి పాలు సరిపోవాలంటే పాల ఉత్పత్తి మెండుగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అందుకోసం ఈ ఆహారాలను మీ రోజువారి డైట్ లో భాగం చేసుకుంటే సరపోతుంది. మరి ఆ ఆహారపదార్థాలేమిటో తెలుసుకుందామా..
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!
మెంతులు..
Must Read ;- ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..
మెంతులు.. మెంతి ఆకులు కూడా పాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతాయి. అంతేకాదు.. తల్లులలో అజీర్ణసమస్యలు వంటివి పరిష్కారమవుతాయి. మెంతులులో క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ఒమెగా-3 కొవ్వు పదార్థాలు మెండుగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు ఎదగడానికి తోడ్పడుతాయి. వీటిని తినగలిగితే మొలకెత్తినవి సలాడ్లో తినవచ్చు లేదా రాత్రి ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా మెంతులు నానబెట్టి.. ఉదయాన్నే వాటిని మరిగించి వడకట్టి పరగడుపున నీళ్లు తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
నట్స్..
ప్రసవం తర్వాత శరీరం ఎంతో నీరసించి ఉంటుంది. అటువంటి సమయంలో శరీరానికి శక్తిని అందించడంతోపాటు.. పాల ఉత్పత్తిని పెంచుతాయి నట్స్. ఇందులో ప్రొటీన్స్, అన్శాచురేషన్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు.. వంటి సంపూర్ణ పోషకాలు ఉంటాయి. వీటిలో వాల్ నట్స్, బాదంపప్పులు ముఖ్యమైనవి. రోజులో నాలుగైదు పప్పులు తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. నట్స్ అలర్జీ ఉన్నవారు నిపుణులు సలహా పాటించడం మంచిది.
Also Read ;- బర్డ్ ఫ్లూ కలకలం.. బాగా ఉడకపెట్టిన చికెన్ తినొచ్చు
కొబ్బరి నూనెతో వంటకాలు..
సాధారణంగా కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు పెద్దగా ఇష్టపడరు. కానీ కొబ్బరినూనెలోకి ఒమెగా-3 ఫ్యాటీఆమ్లాలు తల్లి పాల ఉత్పత్తికి తోడ్పడే హర్మోన్ల విడుదలకు తోడ్పడుతాయి. అంతేకాదు.. తల్లిీబిడ్డలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కొబ్బరి నూనె. అంతేనా.. ప్రసవం తర్వాత జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అటువంటి సమస్య కూడా పరిష్కారమవుతుంది. పూర్తిగా కొబ్బరినూనె వంటకాలు తినలేని వారు.. తినే ఆహారంలో మొదటి ముద్దను కొబ్బరినూనెతో తినే అలవాటు చేసుకుంటే సరి.
ఔషధాల గని తులసి..
తులసిలోని ఔషధ సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఔషధాల నిధి మాత్రమే కాదు.. తల్లి పాలను పెంచే అద్భుత గుణం కలిగిన మొక్క ‘తులసి’. ఇందులోని విటమిన్-కె తల్లి పాలను పెంచుతాయి. వీటిని ఆహారంలో వాడచ్చు, సూప్స్ లాంటి వాటిలో కలుపుకోవచ్చు, తులసి టీ వంటిది కూడా తాగచ్చు. తేనేతో కలిసి ఆకులను నేరుగా కూడా తినచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పుంజుకుంటుంది.
Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?
పురాతన చిట్కా వెల్లుల్లి..
ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుండి చెప్తున్న చిట్కానే. బాలింతలకు వెల్లుల్లి కారం, వెల్లుల్లి పొడులు, వెల్లుల్లిని ప్రతి ఆహారంలో చేర్చి తినిపిస్తుంటారు. ఇందులోని గెలాక్టోగోగ్ అనే పదార్థం తల్లి పాల ఉత్పత్తి మెరుగవడంలో తోడ్పడుతుంది. అంతేకాదు.. గుండె జబ్బులు వంటివి రాకుండా నివారిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
వీటితోపాటు ఇవి కూడా..
- ఓట్ మీల్ కూడా పాల ఉత్పత్తిని పెంచడంలో ప్రముఖమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాదు ప్రసవించిన తల్లులలో రక్తహీనతను నివరిస్తుంది.
- కూరగాయల్లో కొన్ని రకాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాలు బాగా పడతాయి. కాకరకాయ, బీరకాయ, దొండకాయ వంటి తల్లులో పాలు పెరగడానికి ఉపకరిస్తాయి.
- వాముతో కాచిన కషాయంలో కాస్త తేనే కలుపుకుని రోజూ తాగడం వల్ల పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. అంతేకాదు గర్భసంచి తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.
- దాల్చిన చెక్క.. పాల ఉత్పత్తి తక్కువగా ఉందనిపిస్తే.. వెంటనే దాల్చన చెక్కను ఆహారంలో తీసుకుంటే.. పాల కొరతకు చెక్ పెట్టచ్చు.
Also Read ;- వేగన్స్కి ‘గుడ్డు’ న్యూస్..!