యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సంచలన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. న్యూయర్ కానీ.. సంక్రాంతికి కానీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ కి సంబంధించిన అప్ డేట్ ఉంటుంది అనుకుంటే.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున అప్ డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలిస్తోంది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే.. ఇప్పటి వరకు చరణ్ కి సంబంధించిన టీజర్, అలాగే ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. దేశభక్తి నేపధ్యంతో ఉండే ఈ వీడియో ఆడియన్స్ ని సర్ ఫ్రైజ్ చేసేలా ఉంటుందట. జక్కన్న ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని తెలిసింది.
అయితే.. ఎన్టీఆర్ వీడియోకు చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. చరణ్ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసి రానున్న టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేయడం ఖాయం. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.