పూరీ జగన్నాథ్ , రామ్ పోతినేని ఇస్మార్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫిక్షనల్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. అంతకు ముందు నరైన హిట్స్ లేని పూరీ, రామ్ ఈ సినిమా సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకివచ్చారు. రామ్ మెదడులోకి సత్యదేవ్ మెమరీస్ ని ప్రవేశపెట్టి.. పూరీ తనదైన స్టైల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ను తెరకెక్కించాడు. ఈ ఒక్క పాయింట్ దగ్గరే బాలీవుడ్ మేకర్స్ పడిపోయారు. ఆల్రెడీ సినిమా రైట్స్ కూడా కొనేశారు. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుండడం ఆసక్తిరేపుతోంది. బాలీవుడ్ ‘ఇస్మార్ట్ శంకర్’ గా డైనమిక్ హీరో రణవీర్ సింగ్ ను ఎంపిక చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా హీరోగా రణబీర్ కపూర్ పేరు వినిపించింది. అయితే ఇందులో హీరోగా రణవీర్ సింగే నటిస్తున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు ‘కత్తి, విక్రమ్ వేదా, హిట్ , జెర్సీ, అలవైకుంఠపురములో’ లాంటి సౌత్ హిట్స్ అన్నీ బాలీవుడ్ లో రీమేక్ అవడానికి వరుసలో ఉన్నాయి. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే రణవీర్ సింగ్, రామ్ పోతినేని చేసిన ఇస్మార్ట్ రోల్ ను బ్రహ్మాండంగా చేస్తాడని మేకర్స్ భావిస్తున్నారు. మరి ‘ఇస్మార్ట్ శంక’ర్ గా రణవీర్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.











