రవితేజ ‘క్రాక్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమా మీద స్పష్టత వచ్చేసింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు. దీని ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం విడుదల చేయబోతున్నట్లు రమేష్ వర్మ ట్వీట్ చేశారు. రవితేజ ‘క్రాక్’ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రవితేజ, రమేష్ వర్మల సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలన్నది వీరి సంకల్పం. ఇంతకుముందు రమేష్ వర్మతో ‘రాక్షసుడు’ చిత్రాన్ని నిర్మించిన సత్యనారాయణ ఈసారి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సినిమా కథా చర్చలు దాదాపు ఏడాది కాలంగా సాగుతున్నాయి.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తియిందట. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో మీనాక్షి చౌదరిని ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారు. గద్దలకొండ గణేష్ లో ఐటెంసాంగ్ చేసిన డింపుల్ హయతిని మరో కథనాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవంబరు మొదటివారం నుంచే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మాస్ మహరాజ్ రవితేజను పక్కా మాస్ ఎలిమెంట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ‘ఖిలాడి’ అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ చేసే ఓ పాత్ర యోధుడిగా ఉంటుందట.
Next is with my Energetic Mass Maharaja @RaviTeja_offl . Very happy to announce this 😃
Muhurtham & First look tomorrow @ 11:55 AM.#RT67 #RT67FirstLook #KoneruSatyanarayana #AStudiosLLP
@idhavish @PenMovies pic.twitter.com/zeVkpn1Fje— Ramesh Varma (@DirRameshVarma) October 17, 2020











