పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దూరమైన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం ప్రజలకు దగ్గరగానే ఉన్నారు. అప్పుడప్పుడూ తన ఫాలోవర్స్ కు లైవ్ దర్శనమిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఈ బద్రి భామ ఇటీవలే ఇలా లైవ్ లోకి వచ్చారు. మీతో మాట్లాడి చాలా కాలం కావడంతో ఇలా పలకరించాల్సి వచ్చిందంటూ పేర్కొంది. దాంతో ఆమె అభిమానులు కూడా రెచ్చిపోయి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేశారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దని, మెసేజ్ లు పెట్టొద్దని కించిత్ కోపాన్ని కూడా ప్రదర్శిించింది.
ఆమె ఇంకా యవ్వనంతోనే ఉందనేసరికి మురిసిపోయిందామె. సినిమాల్లోకి రావాలంటూ కొందరు అడిగారు. తన వయసేంటో తనకు తెలుసంటూ ఆమె సిగ్గుల మొగ్గ అయ్యారు. అలాగే అకీరా సినిమా రంగ ప్రవేశం గురించి కూడా ప్రశ్నలు వేశారు. అకీరాలో కూడా చురుకుదనం ఏమీ తగ్గలేదని తెలుస్తోంది. అతని కర్ర సాము ఫొటోలను కూడా ఆమె తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
అకీరా కోసం అభిమానుల ఎదురుచూపు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ మీద చాలా మంది కన్ను ఉంది. అతను రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నా పిల్లల యోగాక్షేమాలను పవన్ కళ్యాణ్ కనుక్కుంటూనే ఉంటారు. అప్పుడప్పుడూ తండ్రి వద్దే అతను ఉంటున్నాడని కూడా తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగానే అకీరా ఎంట్రీ ఉంటుందన్న వార్తలు మాత్రం నెట్ లో వైరల్ అవుతుంటాయి. మార్షల్ ఆర్ట్స్ లోనూ అతను శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. హీరోగా అతన్ని తయారుచేసేందుకు పవర్ స్టార్ అతనికి ఎలాంటి శిక్షణ అవసరమో అవన్నీ ఇప్పిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.











