తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య ఎంత ఫేమస్సో.. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కూడా అంతే ఫేమస్. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కోటయ్య కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో కూడా చేరాడు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన కోటయ్య ఆనందయ్య మందు తీసుకున్నాడు. ‘కేవలం ఆనందయ్య మందు వల్లే బతికా. ఆయన మందు చాలా అద్భుతం’’ అని చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఆనందయ్య పేరు మార్మోగింది.
గత నాలుగు రోజులుగా నెల్లూరు GGH లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కోటయ్య సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఆనందయ్య మందుపై భిన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోటయ్య మరణం చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- ఆనందయ్య మందుపై నాకు నమ్మకం ఉంది : బాలయ్య










