టీడీపీ ప్రతినిధి బృందం ఆనందయ్య మందు ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు. మంగళవారం సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి,బిదా రవిచంద్ర,పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితర టీడీపీ నాయకులు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని సందర్శించారు. వారు అక్కడ జరుగుతున్న ఔషధ పంపిణీ తీరుని పరిశీలించారు.తెలంగాణలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడికి రాగా సోమిరెడ్డి సమక్షంలోనే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కలు వేశారు.15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.ఆ విద్యార్థి మాట్లాడుతూ తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు.
నెల్లూరు జిల్లా నాయకులు,అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.గతంలో పోర్టుతో దేశం మొత్తం కృష్ణపట్నం పేరు మోగిందని,నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద చంద్ర అన్నారు.
Must Read ;- ఆనందయ్యపై కేసు నమోదు.. ఎస్పీ కార్యాలయంలో విచారణ











