ఆనందయ్య కరోనా మందుపై తనకు పూర్తి నమ్మకం ఉందని సినీనటుడు,టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నివాళులర్పించిన బాలయ్య ఆనందయ్య మందుపై స్పందించారు. ఆనందయ్య కరోనా మందుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.అభిమానం లేనిదే ఆరాధన లేదు.ఆరాధన లేనిదే మతం లేదు.మతం లేనిదే మానవుడే లేడు.ప్రతిదీ ఒక నమ్మకం,ఆయుర్వేదాన్ని నేను నమ్ముతాను.క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే గొప్ప వైద్య నిపుణుడు ఉండేవారని బాలయ్య గుర్తు చేశారు.ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికీ సుశ్రుతుడి పేరు ఉందని బాలయ్య గుర్తు చేశారు.అలాంటి గొప్ప వైద్యులను కూడా మనం మరచిపోయామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనందయ్య మందు పంపిణీ చేయాలి : జగపతిబాబు
ఆనందయ్య మందుకు అన్ని వర్గాల నుంచి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆనందయ్య మందుపై స్పందించారు.వెంటనే ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఆనందయ్య మందు తయారీ,పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని జగపతిబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇప్పటికే వేలాది మందికి ఆనందయ్య ఉచితంగా మందు పంపిణీ చేశారని,ఎవరికీ సైడ్ ఎపెక్టులు రాలేదని ఆయన గుర్తు చేశారు.ఆనందయ్య ఆయుర్వేద మందు పేదలకు వరంగా మారిందన్నారు.వెంటనే ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జగపతిబాబు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.
Must Read ;- ఆనందయ్య మందుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా..











