తిరుపతి ఉప ఎన్నిక ఎప్పుడో తేలక ముందే ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. అందరికంటే మందే టీడీపీ తమ అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించినా వ్యక్తిగత పనుల్లో ఆమె బిజీగా ఉండి బయటకు రాలేదు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకీ అభ్యర్ధి దొరకటం లేదంటూ ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొద్ది సమయంలోనే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఆమె పోటీలో ఉన్నారని, మంచిరోజు చూసుకుని ప్రచారం ప్రారంభిస్తారని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
అకటా…32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చిపడిందా? తిరుపతి బైఎలక్షన్ కు అభ్యర్థి దొరకడం లేదట. టికెటిచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరూ ముందుకు రావడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఇదే దరిద్రం జిడ్డులా పట్టుకుంటే నిమ్మగడ్డతో వాయిదా వేయించి తప్పించుకున్నాడు. ఇప్పుడెలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 23, 2020
రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన లక్ష్మి గారు ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన సీనియర్ నాయకురాలు.వైసీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి.అధికార పార్టీ అరాచకాలు,కక్షసాధింపులతో విసిగి వేసారిన ప్రజానీకం @JaiTDP గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.(2/2)#JaganFailedCM
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) November 23, 2020
Also Read:-పునాది పడకముందే రాద్ధాంతం..!











