తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రోజురోజుకూ గేరు పెంచుతున్నారు. మరింత తీవ్రమైన విమర్శలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. రెండు రోజులుగా నివర్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి.. రైతులకు సాయం అందించకపోతే.. తిరుగుబాటు రుచిచూపిస్తామని హెచ్చరించిన నారా లోకేష్.. ప్రొద్దుటూరులో తెలుగుదేశం నాయకుడి హత్యోదంతంపై మరింత తీవ్రంగా స్పందించారు. జగన్ ను తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ సోషల్ మీడియా వేదిక మీద వరుస పోస్టులు పెట్టారు.
ట్విట్టర్ లో నారా లోకేష్ ఏమంటున్నారంటే..
‘‘ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం జగన్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు.నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేతవర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసారు.
మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టిడిపి జిల్లా అధికారప్రతినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు. హత్య చేసిన ఎమ్మెల్యే,అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి.
వేటకొడవళ్లతో తండ్రిని నరికేయించావు.నువ్విచ్చే పరిహారంతో అనాథలైన ఆ పిల్లలకు తండ్రిని తేగలవా? జగన్‌రెడ్డీ!’’ అని లోకేష్ ట్వీట్లు చేశారు.’’
ముదురుతున్న హత్యోదంతం
ప్రొద్దుటూరు తెలుగుదేశం నాయకుడు నందం సుబ్బయ్యను వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అత్యంత కిరాతకంగా హత్య చేశారనే వార్తలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతున్నాయి. ఈ హత్యవెనుక ఎమ్మెల్యే ఉన్నారంటూ.. మృతుని భార్య కూడా ఆరోపిస్తోంది. ఈ వివాదం మరింత తీవ్రంగా మారుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు, రౌడీ రాజకీయాల ద్వారా అణచివేయడానికి, తమకు వ్యతిరేకంగా గళమెత్తే వారిని భయటపెట్టడానికి తెగిస్తోందంటూ.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలచడానికి తెలుగుదేశం సిద్ధమవుతోంది.
Must Read ;- జగనన్న పాలనలో హత్యారాజకీయాలు జడలు విప్పుకుంటున్నాయా?
ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం @ysjagan. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు.నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేతవర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసారు.(1/3)
— Lokesh Nara (@naralokesh) December 30, 2020











