జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్.. ఈ విషయం అందరికీ తెలుసు. మరి అలాంటి ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ అంత స్పీడ్ గా స్టెప్ వేయగలడా అన్న ప్రశ్నకు సమాధానమే ఈరోజు విడుదలైన ట్రిపుల్ ఆర్ పాట. ఒకర్ని మంచి ఇంకొకరు పోటీ పడి స్టెప్ వేశారనడం అతిశయోక్తి కాదు. ‘పొలంగట్టు దుమ్మలోన పోట్లగిత్త దూకినట్టు..పోతరాజు జాతరలో పోలేరమ్మ ఊగినట్టు కిర్రు సెప్పులేసుకుని కర్రసాము చేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు గూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు’ అంటూ రెచ్చిపోయారు.
ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఈ పాటను తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు సినీ అభిమానులు అందరి నోట ఇదే మాట. ఈ సంచలన చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి నాటు నాటు అంటూ సాగే పాట విడుదల చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆఖరికి నాటు నాటు పాట వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని రెండో పాటైన నాటు నాటు.. లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో ఈరోజు విడుదల చేశారు. నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు… అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.
ఇప్పటికే విడుదలైన తొలి గీతం దోస్తీకి విశేష స్పందన లభించింది. నాటు నాటు సాంగ్ కు కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుంది. బెస్ట్ డ్యాన్సర్స్ అయిన తారక్, చరణ్ పోటీపడి డ్యాన్స్ చేస్తుంటే.. చూడడానికి రెండు కళ్లు చాలవడం లేదు అనిపిస్తుంది. ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. అంతలా ఉంది ఈ సాంగ్. ఒక్కసారి వింటే.. చూస్తే సరిపోదు… మళ్లీ మళ్లీ వినేలా.. చూసేలా ఉంది.











