నందమూరి నటసింహం బాలకృష్ణ.. క్రాక్ మూవీతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలయ్య సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా చేస్తుండడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
దర్శకుడు గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. ఈ కథ కోసం గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. పుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ మూవీ ప్రారంభోత్సవంకు ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు.
నవంబర్ 13, ఉదయం 10:26 ఈ క్రేజీ మూవీని ప్రారంభించేందుకు టైమ్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ష సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు. అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.











