పాప్ సింగర్ రిహానా, ప్రకృతి ప్రేమికురాలు, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన గ్రెటాలు, భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై చేసిన ట్వీట్లు నిప్పును రాజేశాయి. వాటిని కాస్త సీరియస్‌గా తీసుకున్న కేంద్రం, కొందరు అనవసర వ్యాఖ్యలు చేసి పరిస్థితిని జటిలం చేస్తున్నారని స్పందించింది. అంతేకాదు, ట్విట్టర్‌కు నోటీసులు కూడా పంపింది. రైతుల ఉద్యమంపై రెచ్చగొట్టే హ్యాష్ ట్యాగ్‌లను ప్రోత్సహిస్తున్నారని.. కేంద్రం అనుమతి ఇవ్వకుండానే రైతు నాయకుల ట్విట్టర్ అకౌంట్లు మళ్లీ యాక్టివేట్ చేశారని తమ నోటీసులో కేంద్రం పేర్కొంది.
ప్రపంచ దేశాల మద్దతు..
కేంద్రం నోటీసుల అనంతరం, ప్రపంచ దేశాలు రిహాన్నాకు మద్దతు ప్రకటిస్తూ వరసగా ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ప్రపంచ దేశాల్లోని పలు ప్రముఖులు రైతులకు మద్దతునిస్తూ, ట్వీట్లు చేశారు.
Must Read ;- రైతుల అదృశ్యం, ఖాకీలకు భద్రత లేదు.. అసలేం జరుగుతోంది?
Solidarity to the Indian Farmers.
Thank you Rihanna.
In an era where political leadership is lacking we are grateful for others stepping forward#FarmersProtest pic.twitter.com/jdZnGWURBl
— Claudia Webbe MP (@ClaudiaWebbe) February 2, 2021
The unfolding events in India are troubling. As a member of the Foreign Affairs Committee, I am closely monitoring the situation. The right to peaceful protest must always be respected. #FarmersProtest
— Rep. Jim Costa (@RepJimCosta) February 2, 2021
స్పందించిన భారతీయ ప్రముఖులు..
వివాదరహితుడిగా పేరు గాంచిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెండుల్కర్, ప్రపంచ దేశాల మద్దతుపై స్పందించారు.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
‘భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఏ చర్యకు మద్దతునివ్వకూడదని పిలుపునిచ్చారు. భారతీయులంతా ఒక్కటేనని.. ఐక్యతంగా నిలివాలని చెప్పుకొచ్చారు. బాహ్య ప్రజలు కేవలం ప్రేక్షకులు మాత్రమేననీ.. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడానికి ఏమాత్రం హక్కలేదన్నారు. మన దేశం గురించి మనకు తెలుసు. భారతీయులుగా మన సమస్యను మనం పరిష్కరించుకోగలమని’ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read ;- రైతుల దీక్షలో చీలిక: కేంద్రం తలచినదే జరిగినదా?
రోహిత శర్మా
India has always been stronger when we all stand together and finding a solution is the need of the hour. Our farmers play an important role in our nation’s well being and I am sure everyone will play their roles to find a solution TOGETHER. #IndiaTogether 🇮🇳
— Rohit Sharma (@ImRo45) February 3, 2021
విరాట్ కొహ్లీ
Let us all stay united in this hour of disagreements. Farmers are an integral part of our country and I'm sure an amicable solution will be found between all parties to bring about peace and move forward together. #IndiaTogether
— Virat Kohli (@imVkohli) February 3, 2021
పి.టి. ఉష
We are proud of our own culture and heritage and are the true model of Democracy. Don't interfere in our internal matters, we know how to resolve our own issues because we are one and only nation in the world upholding UNITY IN DIVERSITY.#IndiaTogether#IndiaAgainstPropaganda
— P.T. USHA (@PTUshaOfficial) February 4, 2021
సచిన్‌తో పాటు పలువురు క్రికెటర్లు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం దేశానికి మద్దతు తెలుపుతున్నారు.