అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడం తెలిసిందే. అయితే.. విడాకుల తర్వాత సమంత తొలిసారి తన మనసులో బాధను బయటపెట్టింది. బాలీవుడ్ మీడియాకి ఇంటర్ వ్యూ ఇచ్చిన సమంత విడాకుల గురించి స్పందిస్తూ.. ఆ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. చైతుతో విడిపోతున్నప్పుడు కృంగిపోయా చనిపోతానేమో అనుకున్నాను. ఆ బాధను తట్టుకోలేనేమో అనుకున్నాను. అయితే.. ఆతర్వాతే తెలిసింది నేను బలహీనురాలిని కాదు.. బలవంతురాలిని అని. మన జీవితంలో కొన్నిరోజులు చెడుగా ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి.
ఎప్పుడైతే వాటిని అంగీకరించి ముందుకు వెళ్తామో సగం పని అయినట్లే. ఎప్పుడైతే మనం అంగీకరించమో.. అంతం లేని యుద్ధం చేస్తున్నట్లే.. నిజానికి నేను చాలా బలహీనమైన వ్యక్తిని అని అనుకుంటాను కానీ.. నా వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూసి నాకే ఆశ్చర్యమేస్తోంది. ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు అని చెప్పింది.
ప్రస్తుతం కెరీర్ మీద దృష్టిపెట్టాను. విడాకులతో నా ప్లాన్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. ఇక నుంచి జీవితంలో ఎలా సాగితే.. అలా వెళ్లిపోవడమే.. ప్లాన్స్ అంటూ ఏమీ లేవు అని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం త్వరలో విడుదల కానుంది. యశోద అనే పాన్ ఇండియా మూవీ చేస్తుంది. అలాగే ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే అంతర్జాతీయ చిత్రంలో ఆమె నటించనున్నారు. పుష్ప సినిమాలో ఐటం సాంగ్ లో కూడా నటించింది.
Must Read ;- యశోదగా సమంత











