కుక్క పిల్ల.. అగ్గి పుల్ల.. కాదేదీ విషెస్ కు అనర్హమే. అందుకే సమంత గారాట పట్టి హేష్.. అదేనండీ కుక్క పిల్ల పుట్టిన రోజు సమంతకు పండగ రోజే. హేష్ ను ముద్దులతో ముంచెత్తుతూ పుట్టిన రోజు శుభాకాంక్షల తెలుపుతూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తోంది. ఇది చూసి నెటిజన్లకు మాత్రం మండుతోంది. ఎందుకంటే నిన్ననే చైతూ (నాగ చైతన్య) పుట్టిన రోజు. చైతూ నుంచి విడిపోయినా కనీసం పాత స్నేహాన్ని గుర్తు చేసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుందేమోనని నెటిజన్లు ఆశగా ఎదురుచూశారు.
ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈరోజు మాత్రం హేష్ కు విషెస్ చెబుతూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చైతూకు, సమంతకు మధ్య ఉన్నది నాలుగేళ్ల వివాహ బంధమే అయినా ఏడేళ్ల స్నేహం ఉంది. పైగా నిన్న చైతు నటించిన బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇద్దరూ వేర్వేరు దారుల్లో కొనసాగుతామని, తమ స్నేహం మాత్రం కొనసాగుతుందని ప్రకటించడంతో నెటిజన్లు ఆశగా ఎదురుచూశారు. వీరిద్దరూ విడిపోవడాన్ని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
అక్కినేని నాగార్జున పుట్టిన రోజు వచ్చినప్పుడు సామ్ శుభాకాంక్షలు తెలిపింది. అప్పటికే చైతూతో విభేదాలున్నా ఎక్కడా బయటపడలేదు. పోనీ సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందా అంటే అదీ లేదు. అందులో ఆమె చాలా యాక్టివ్. ఇంతకీ హేష్ అంటే ఇద్దరికీ ముద్దే. దీంతో చాలా వీడియోలు ఇద్దరూ షేర్ చేశారు. ఇప్పుడు హేష్ మాత్రం సమంతతోనే ఉంటోంది. సామ్ నుంచి ముద్దులు అందుకుంటోంది. ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో. నెటిజన్లు కాస్త శాంతిస్తే మంచిది.
Must Read ;- నిన్న సమంత.. నేడు ప్రియాంక.. అసలేం జరిగింది?