టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఈ మూవీకి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ చేయాలి అనుకున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటే.. ఇప్పటికి సెట్ అయ్యింది.
ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యువ సమ్రాట్ నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. బంగార్రాజు కథ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. నాగ్ – చైతు కలయికలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. చైతు కొడుకు పాత్రలో నాగార్జున కనిపిస్తారట. అంటే ఈ సినిమా మొత్తం బంగార్రాజు అతని మనవడు నాగ్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. బంగార్రాజు పాత్ర – బంగార్రాజు మనవడి పాత్ర కలయికలో వచ్చే సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. మొత్తానికి.. తాత మనవళ్లు చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుందని.. ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బంగార్రాజు పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
బంగార్రాజు పొగ్రెస్ విషయానికి వస్తే.. దాదాపు అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని వంగలపూడి గ్రామంలో షూటింగ్ జరుపుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మరి.. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం వలే బంగార్రాజు సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి.
Also Read : నాగార్జున, నాగచైతన్యల బంగార్రాజు మొదలైంది కానీ..











