బాలీవుడ్ సినీ సెలబ్రిటీల ఇంట పెళ్లి భాజా మోగబోతోంది. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ జంటల మీద పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. కాబట్టి వీరికి పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్టే. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్, రణ్ బీర్ కపూర్ – ఆలియా భట్ డిసెంబరులో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అంకితా లోఖండే వచ్చే నెలలో తన బాయ్‌ఫ్రెండ్ విక్కీ జైన్‌ని పెళ్లిచేసుకోబోతోంది. తాజాగా ఈ జాబితాలో రాజ్ కుమార్ రావు – పత్రలేఖ కూడా చేరిపోయారు. వారు ఏకంగా ఇదే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది వార్త.
ఈ నెల 10, 11 తేదీల్లోగానీ 12 వ తేదీ గానీ వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరు ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారో కూడా తెలిసింది. రాజ్ కుమార్ రావు, పత్రలేఖ రాజస్థాన్ వెళ్లి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వారు జైపూర్ లో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకుంటున్నారని, ఇప్పటికే ముఖ్యలందరికీ ఆహ్వానాలు వెళ్లాయని సమాచారం. వీరిద్దరూ కలిసి 2014లో హన్సల్ మెహతా రూపొందించిన సిటీలైట్స్ లో కలిసి జంటగా నటించారు. వీరి ప్రయాణం అలా కొనసాగింది. ఆ తర్వాత ఏక్తాకపూర్ వెబ్ షో బోస్: డెడ్ /అలై లోనూ కనిపించారు. అప్పట్నుంచి వీరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రలేఖ పుట్టిన రోజు సందర్భంగా రాజ్ కుమార్ రావు తన ప్రేమను వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దాన్ని వ్యక్తం చేశారు. హేపీ బర్తడే మై లవ్ అంటూ ప్రకటించడంతో నెటిజన్లు కూడా వీరి మధ్య ప్రేమను ధ్రువపరచుకున్నారు. ఇలా వీరి మధ్య పుట్టిన ప్రేమకు ఈ నెలలో జరిగే పెళ్లితో శుభం కార్డు పడబోతోంది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా రాజస్థాన్ లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో వేచి చూద్దాం.
Must Read ;- ఓ హీరోయిన్ ‘శ్రుతి’మించని రిలేషన్ షిప్











