బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఫేమస్ టాక్ షో `కాఫీ విత్ కరణ్`. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ షోకి రావడం, అక్కడ తమ వ్యతిగత విషయాలను నిర్మొహమాటంగా పంచుకుంటూ ఉండడంతో ఈ “షో” ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది.తెలుగునాట టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తాజాగా బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ తో కలిసి `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొన్న ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది.
షో లో భాగంగా కరణ్ నాగచైతన్యతో రిలేషన్ గురించి సామ్ ను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చైతుతో విడాకుల తర్వాత పరిస్థితి, ట్రోలింగ్ గురించి కరణ్ కు కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా సమాధానమిచ్చింది.ఇక మాటల మధ్యలో కరణ్ ‘నీ భర్త’ అని చైతు గురించి ప్రస్తావించగానే..సమంత అసలు ఏమాత్రం ఆలోచించకుండా ‘మాజీ భర్త’ అని కరణ్ మాటను సరిచేసింది.
అదేసమయంలో ప్రస్తుతం చైతూ, సమంత మధ్య ఎటువంటి రిలేషన్ ఉందని కరణ్ మరో ప్రశ్న వెయ్యగా.. ‘‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు లాంటి వస్తువులను దాచేయాలి. మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో పరిస్థితి ఫ్రెండ్లీగా ఉంటుందేమో చెప్పలేను కానీ.. ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే’’ అని సామ్ స్పష్టం చేసింది.ఇక విడాకుల తర్వాత తాను 250 కోట్లు భరణం తీసుకున్నాననీ, పెళ్లికి ముందు అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల భరణం రాలేదని ఇలా తన గురించి చాలామంది ఏవేవో రాతలు రాశారని, ట్రోలింగ్ చేయడం కూడా తాను చూశానని.. తాను చదివిన గాసిప్పులో అవే చెత్తవని.. విడాకుల వల్ల నేనేమీ అప్‌సెట్ కాలేదు’’ అని సామ్ చెప్పుకొచ్చింది.
అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ ఇద్దరూ కలవాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు సమంత మాటలను బట్టి ఇద్దరి మధ్య చాలా జరిగిందనే తెలుస్తోంది. ‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు లాంటి వస్తువులను దాచేయాలి’ అని సమంత అంటోంది అంటే ఇద్దరి మధ్య వార్ గట్టిదనే అర్థమవుతోంది.