జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె… సరిగ్గా 100 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లలో నివాసముంటున్న తన కుమారుడు జీవీ నరసింహారావు వద్ద ఆమె ఉంటున్నారు.వయోభారంతో పాటు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాద్యపడుతున్న సీతామహాలక్ష్మి నిన్న రాత్రి కన్నుమూశారు.
పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. సీతామహాలక్ష్మి మరణం విచారకరమని.. దేశ స్వాతంత్ర్యోద్యమంలో తండ్రికి తోడుగా నిలిచారని అన్నారు. అంతేకాకుండా పింగళి గొప్పదనం నేటి తరానికి తెలిసేలా సీతామహాలక్ష్మీ ఎంతో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.