కొణిదెల ఉపాసన పర్యవేక్షణలో అక్కినేని కోడలు, సినీ నటి సమంత గరెటిపట్టి బ్రౌన్ రైస్‌తో టమాటో రైస్ వండింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత చాలా మంది తమ ఆరోగ్యంపైన శ్రద్ధ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తీసుకునే ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసుకుంటున్నారు.హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్సైట్ ద్వారా ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఏం ఆహారం తీసుకుంటే తమ ఆరోగ్యం బాగుంటుందనే విషయాలపై అవగాహనను కల్పిస్తోంది.
సమంత వైట్ రైస్ తినదంట..
ఈ వెబ్‌సైట్‌కు సమంత అక్కినేని గెస్ట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అయితే బ్రౌన్ రైస్‌తో టమాటో రైస్(తక్కతి సదం)ను సమంత తయారు చేసి చూపించారు. ఉపాసన పర్యవేక్షణలో సమంత చేసిన వంటకం అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. తాను ప్రతిరోజూ రైస్ తింటానని, అయితే వైట్ రైస్ తిననని చెప్పింది. సమంత బ్రౌన్ రైస్‌ను మాత్రమే తీసుకుంటానని చెప్పారు. బ్రౌన్ రైస్‌తో చాలా లాభాలు ఉన్నాయని చెప్పింది. వీరిద్దరు తమిళంలో మాట్లాడుకుంటూ తక్కలి సదం అనే రెసిపిని వండారు. ఉపాసన మాట్లాడే తమిళం తన తల్లి మాట్లాడే తమిళంలా ఉందని అక్కినేని కోడలు పేర్కొన్నది. అయితే సమంత వండిన వంటకం చేయడానికి చాలా సింపుల్‌గా ఉండటమే కాదు, అదితింటే రుచికి రుచి, దానికితోడు చాలా ఆరోగ్యమంట. ఈ వీడియో చూసిన వారంతా తక్కలి సదం భలే ఉందంటున్నారు.
సమంత కూడా ఈ మధ్య అర్బన్ ఫామింగ్ పేరు తో సమంత, యువర్ లైఫ్ డాట్‌కామ్ పేరుతో ఉపాసన ఇద్దరూ వ్యాయామం మీద, తీసుకునే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదికపై అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా ఉందని పబ్లిక్ అనుకుంటున్నారు.