తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారని, పోలీసులను ఎంఐఎం చేతుల్లో పెట్టారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భైంసాలో అల్లర్లు చెలరేగుతున్నాటీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పట్టన్నట్టు ఉందని, దీంతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందోనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర నుంచి బహిష్కిరించిన నేరస్థులు భైంసాలో తిష్టవేశారని, పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లనే భైంసా అల్లర్ల గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ప్రగతి భవన్‌ను ముట్టడించి మరి ప్రశ్నిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Must Read ;- రెండు చోట్ల ఎగిరేది కాషాయ జండానే.. బండి సంజయ్