తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై బీజేపీ దృష్టి సారించింది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆ పార్టీ శాసనసభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్‌లతో హైదారాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించారు. కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని పేర్కొన్నారు.
Must Read ;- రెండు చోట్ల ఎగిరేది కాషాయ జండానే.. బండి సంజయ్