‘కేజీయఫ్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇప్పుడు ‘కేజీయఫ్’ సినిమాకు కొనసాగింపుగా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇటీవల ‘కేజీయఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో సంజయ్ దత్ పాల్గొంటున్నారు.
‘కేజీయఫ్ చాప్టర్ 2’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు ‘అధీరా’ గా సంజు బాయ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సంజు కేన్సర్ కారణంగా అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో చిత్ర యూనిట్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సంజయ్ కోలుకోవడంతో వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ ను సెట్ చేసేసారు. ఆయన మీద అంతగా ఒత్తిడి లేకుండా ఆయన సీన్స్ తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు.
ఇటీవలే యష్ పై కొన్ని కీలక షాట్స్ ను దర్శకుడు నీల్ తెరకెక్కించారు. ఇపుడు సంజయ్ కూడా రెడీ కావడంతో ఈ ఇద్దరిపై మిగిలి ఉన్న షాట్స్ ను రెడీ తెరకెక్కించడమే మిగిలి ఉంది. ఈ సినిమా కోసం యష్ అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సిని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .











