లాక్ డౌన్ కారణంగా ఇప్పటి వరకూ ఇళ్ళకే పరిమితమైపోయిన టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ గా శర్వానంద్ కూడా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రారంభమై కరోనా కారణంగా బ్రేక్ పడిన .. ఒక సినిమా షూటింగ్ లో తిరిగి జాయిన్ అవడం ఆసక్తిని రేపుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకార్తిక్ దర్శకత్వంలో యస్.ఆర్.ప్రకాశ్ బాబు, యస్.ఆర్ .ప్రభు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమలా అక్కినేని ఇందులో శర్వానంద్ కి తల్లిగా నటిస్తున్నారు. అలాగే.. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి రవి రాఘవేంద్ర తండ్రిగా నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయట.
రీసెంట్ గా శర్వానంద్ తన ఫేస్ బుక్ అఫీషియల్ పేజ్ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్ని ఖుషీ చేశాడు. లాక్ డౌన్ కు ముందే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. రీతూవర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా శర్వాకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











