కొంతకాలంగా వరుస పరాజయాలు ఫేస్ చేస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆ కారణంగానే తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మంచి కథల్ని ఎంపికచేసుకుంటూ.. తన కెరీర్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలెంటెడ్ యువ దర్శకులతోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే.. కిషోర్ రెడ్డి అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ .. ఏడునెలల తర్వాత ఈ రోజే తిరిగి ప్రారంభం అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శర్వానంద్ వ్యవసాయదారుడిగా నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ ను కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. పున: ప్రారంభించారు. మొన్నా మధ్య విడుదలైన శ్రీకారం టీజర్ అందరినీ ఆకట్టుకుంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమలా అక్కినేని మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చుతున్నారు.
how it started. how it’s going ❤️ pic.twitter.com/DdlDwNvAna
— 14 Reels Plus (@14ReelsPlus) October 8, 2020











