ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు- అశ్విని పొన్నప్ప మెరుగయ్యారు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి ప్రవేశించారు. టొయొటా థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సెమీస్ చేరిన ఈ జోడీ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీస్ చేరుకున్న సాత్విక్- చిరాగ్‌శెట్టి జోడీ పదో ర్యాంకును పదిలం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ స్థానంలో ఉన్నారు. సైనా 20 నుంచి 19వ ర్యాంక్‌కు ఎగబాకారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 13వ, సాయిప్రణీత్ 17వ, కశ్యప్ 26వ, సమీర్‌వర్మ 27వ ర్యాంకుల్లో ఉన్నారు.
మార్చి 2 నుంచి 7 వరకు జరిగే స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయి. మేలో జరిగే ఇండియన్ ఓపెన్ అనంతరం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంక్‌ల ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు షట్లర్లు అర్హత సాధిస్తారు.
Must Read ;- వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భారత షటర్ల కథ ముగిసినట్లే!











