తెలుగు సినిమా రంగంలో ఒక అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఆ సంస్థ అధినేత కె.ఎస్ .రామారావు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, పాన్ ఇండియాస్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ హీరోలుగా ఎన్నో హిట్ చిత్రాలని సినిమాలని నిర్మించారు. యువ హీరో సత్య దేవ్ ప్రతిభా వంతమైన నటుడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో పరిచయమైనా ‘జ్యోతిలక్ష్మి’సినిమాతో హీరోగా అందరికీ తెలిశాడు.
బ్లఫ్ మాస్టర్, 47 రోజులు, ఉమా మహేశ్వరస్య ఉగ్రరూపస్య లాంటి సినిమాలతో అందరి ఆదరణ పొందారు. గాడ్స్ అఫ్ ధర్మపురి, లాక్డ్ మొదలు అయిన వెబ్ సిరీస్ తో, ఓటీటీ ప్లాటుఫార్మ్స్ మీద సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సత్య దేవ్ హీరో గా, కె.ఎస్. రామారావు ఓ సినిమా నిర్మించబోతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది.











