మూడ్ స్వింగ్స్, పొత్తుకడుపులో నొప్పి, రక్త స్రావం ఇలా ఎన్నొ సమస్యలు నెలసరి సమయంలో అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. కొందరు తెలియక అనారోగ్యాలు తెచ్చికొంటుంటుంటే, మరికొందరు శ్యానిటరీ పాడ్స్ కొనలేక వ్యక్తిగత శుభ్రత పాటించలేక అనారోగ్యాల పాలవుతున్నారు. అటువంటి దుస్థితి ఏ మహిళకు రాకూడదన్న ఆలోచనే ‘స్కాట్లాండ్’ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే విధంగా ప్రోత్సహించింది. తాజాగా అక్కడి పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ దేశ మహిళలందరికీ శానిటరీ న్యాప్ కిన్లు ఉచితంగా అందంచే మొదటి దేశంగా అవతరించింది ‘స్కాట్లాండ్’.
ప్రతిపాదన ఇప్పటిది కాదు
స్కాట్లాండ్ మహిళలకు శ్యానిటరీ ప్యాడ్లు అందించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. దాదాపు రెండేళ్ల క్రితమే 2018 లోనే పార్లమెంట్ సభ్యురాలు మోనికా లెనన్ ప్రతిపాదించారు. దాదాపు సంవత్సర పోరాటం అనంతరం 2019 నవంబర్ పార్లమెంట్ మొదటి దశ ఉచిత న్యాప్ కిన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. అందులో భాగంగా 31 మినియన్ల డాలర్లను కేటాయించనున్నట్లు కూడా ప్రకటించింది. అప్పటి ఆ బిల్లు నేడు పూర్తిస్థాయిలో అమలు జరగడానికి పార్లమెంట్ లోని అన్ని పార్టీలు మద్ధతు తెలపడం గమనార్హం. ఈ బిల్లు పాసైన తర్వాత, ‘మహిళల గౌరవం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు, నేడు స్కాట్లాండ్ దేశ చరిత్రతోనే గర్వించదగ్గ విషయం. ఈ చర్య ద్వారా ప్రపంచానికి ఒక మార్గనిర్ధేశం చేసింది స్కాట్లాండ్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మోనికా లెనన్.
Must Read ;- వీరికే ఎందుకు చోటు దక్కింది?
Thank you to everyone who has campaigned for period dignity and to my MSP colleagues for backing the Bill tonight.
A proud day for Scotland and a signal to the world that free universal access to period products can be achieved. #freeperiodproducts 🏴 https://t.co/NC3e97jPuQ
— Monica Lennon (@MonicaLennon7) November 24, 2020
తొలి ప్రయత్నం
దేశంలోని మహిళలకు శ్యానిటరీ న్యాప్ కిన్లు ఉచితంగా అందిస్తున్న మొదటి దేశంగా అవతరించింది స్కాట్లాండ్. కానీ, ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం అనుకుంటే పొరపాటే. స్కాట్లాండ్ ఈ నిర్ణయానికి ముందు దశల వారిగా అములు చేస్తూ నేడు ఈ సంచలనానికి తెర తీసింది. దాదాపు 3 సంవత్సారాల క్రితమే, దేశంలోని పాఠశాలలు, విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు ద్వారా మహిళలకు శ్యానిటరీ న్యాప్ కిన్లను ఉచితంగా అందించడం ప్రారంభించింది.
ఆ తర్వాత 2019 లో అధికారంగా మొదటి దశను మొదలుపెట్టి, నేటికి పూర్తి స్థాయిలో అములు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. పేదరికం కారణంగా ఏ మహిళ కూడా వ్యక్తిగత శుభ్రతను పాటించలేక ఇబ్బందిపడకూడదనే ఆలోచనే నేడు ఈ కార్యచరణకు మార్గం సుగమం చేసింది.
Proud to vote for this groundbreaking legislation, making Scotland the first country in the world to provide free period products for all who need them. An important policy for women and girls. Well done to @MonicaLennon7 @ClydesdAileen and all who worked to make it happen https://t.co/4lckZ4ZYIY
— Nicola Sturgeon (@NicolaSturgeon) November 24, 2020
మన దేశ పరిస్థితి ఏంటి?
మన దేశంలో శ్యానిటరీ న్యాప్ కిన్లపై అవగాహాన కూడా లేని మహిళలు చాలా మంది ఉండడం దురదృష్టకరమనే చెప్పాలి. వారికి అవగాహాన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాలల్లో, విద్యాలయల్లో ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాదు, 2019 అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని నోయిడా లోని 21 మెట్రో స్టేషన్లో ఉచితంగా అందించడం ప్రారంభించారు.
దీనితో పాటు, చాలా కాలం పోరాటం తర్వాత జి ఎస్ టి నుండి మినహాయింపు కలిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నేటికి వీటికి కొనడానికి డబ్బు వెచ్చించలేని పరిస్థితిలో ఎందరో మహిళలు ఇబ్బందిపడుతున్నారు. స్కాట్లాండ్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ మహిళల గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత.
హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
మహిళలు మాట్లాడడానికి కూడా ఇబ్బందిపడే నెలసరి సమస్య విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న స్కాట్లాండ్ ని ప్రపంచ దేశాలలోని మహిళలు అభినందిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచదేశాలు కూడా మహిళల సమస్యలను అర్ధం చేసుకోవాలని నినదిస్తున్నాయి. ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ శ్యానిటరీ న్యాప్ కిన్లపైన కొంత పన్నును వసూలు చేస్తున్నారు. దాని వల్ల ఇప్పటికీ చాలా దేశాల్లో వీటిని కొనలేక ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. ఉచితంగా అందించకపోయినా, కనీసం ఇలాంటి వాటిని ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.