సామాన్యుడి అభివృద్థే లక్ష్యంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం. కనీసం ముక్కుముఖం కూడా తెలియని వారికి టికెట్లు ఇచ్చి నేడు రాజకీయ రంగంలో అసామాన్యులుగా ఎదిగేందుకు దోహదపడిన పార్టీ. మహిళా సాధికారతను ఎన్నటికీ మరవని పార్టీ తెలుగుదేశం అని చెప్పచ్చు. ఇదే మాటను జిహెచ్ యంసి ఎన్నికల్లో కూడా నిరూపించి చూపించింది. అందుకు నిదర్శనమే ఈ ఇద్దరు సామాన్య మహిళలు.
సమస్యనెరిగిన వాళ్లం
ఫర్హానా, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక సామాన్యుడి భార్య. బేగంపేట డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తుంది. అతి సామాన్యమైన కుటుంబ నేపథ్యం కలిగిన ఈమె నినాదం కేవలం ఒకటే. ఈ ప్రాంత సమస్యలు తెలిసిన దాన్ని కనుక, మీ అందరి కోసం పోరాడుతాను అంటూ ప్రతి ఒక్కరికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుంది. వాటి పరిష్కారం ఎలా చేస్తుందో వివరిస్తూ కాలినడకన ప్రచార సాగిస్తూ ప్రతి ఒక్కరి సమస్యలకు ప్రతినిధిగా నిలబడతానని చెప్తుంది.
ఇంకొకరు, రేఖ, బట్టలు ఇస్త్రీ చేసుకునే మహిళ. ఈమె రామగోపాల్ పేట నుండి తెలుగుదేశం తరపున పోటీలో నిలబడింది. కష్టం తెలిసిన దాన్ని మీ సమస్యలు ఎరిగిన దాన్ని కనుక తనని గెలిపిస్తే, మీ సహకారంతో సమస్యల పరిష్కారం చేపడతానని హామీ ఇస్తుంది. ‘గొప్పవాళ్లు పోటీ చేసి ఇంకా గొప్పవాళ్లు అవుతున్నారు తప్ప సమస్యలు తీరడం లేదని, నాలాంటి సామాన్యులకు అవకాశమిస్తే, ఇప్పటికే సమస్యల తెలిసిన దాన్ని కనుకు పరిష్కారిస్తానంటూ’ అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది తెలుగుదేశం మహిళా అభ్యర్థి.
సామాన్యలే సమస్యను అర్ధం చేసుకోగలరు
కార్లలో హాయిగా తిరిగే వాడికి రోడ్లు ఎలా ఉన్నాయో, చుట్లూ సమస్యలేమిటో ఎలా తెలుస్తుంది. ఇదే లాజిక్ తో ప్రజలకి దగ్గరవుతుంది తెలుగుదేశం. హైదరాబాద్ ఎన్నికల్లో సమస్యలెరిగిన సామాన్య మహిళలతో ఎన్నికల వ్యూహరచనకు సిద్ధమైంది. రోజూ వారి పనిచేసే వారికి చుట్టూ ఉన్న సమస్యలేమిటనేది బాగా అవగాహాన ఉంటుంది. వాటిని ఎలా పరిష్కారించాలో కూడా సమస్యను ఎదుర్కొంటున్న వారి కంటే ఇంకెవరికి తెలుస్తుంది.
Must Read ;- బల్దియా కావాలంటే.. కేసీఆర్ మెట్లు దిగక తప్పదు!