దుబ్బాక ఉప్పఎన్నికల ఫలితాల కౌంటింగ్ నడుస్తోంది. మొదటి 5రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తే 6వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. నువ్వా నేనా అన్నంతగా ఉత్కంఠ వాతావరణం ఇరు పార్టీ అభ్యర్థల మధ్య నడుస్తోంది. ఒకటి నుంచి 5 రౌండ్ల వరకు వరుసగా బీజేపీ పార్టీ పూర్తి ఆధిక్యతలో ఉండగా ఆరవ రౌండ్‌లో మాత్రం బీజేపీని వెనక్కి నెట్టి కారు తన స్పీడ్‌ను పెంచింది. 6వ రౌండ్ ముగిసే సరికి కూడా బీజేపీ పార్టీ 2667 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కేవలం ఆరవ రౌండ్‌లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యం ఉంది. ఇప్పటి వరకు 45వేల ఓట్ల లెక్కింపు జరిగింది. 6 రౌండ్‌లో బీజేపీకి 3709 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4062 ఓట్లు, కాంగ్రెస్‌కు మాత్రం 530 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి బీజేపీ పార్టీ అధిక్యం కనబరుస్తూ కమలం పువ్వు వికసించే దిశగా పయనిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమై వస్తోంది. అలాగే టీఆర్ఎస్ ఐదు రౌండ్ల తరువాత జరిగిన 6వ రౌండ్ కౌంటింగ్‌లో కాస్త ఆధిక్యాన్ని కనబరిచింది.
బీజేపీకి 20226 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్17559, కాంగ్రెస్ పార్టీకి 3254 ఓట్లు ఇప్పటి వరకు పోలయ్యాయి. ప్రస్తుతం ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తి అయింది. మొత్తం 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఇంకా17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దుబ్బాక ఫలితాలపై రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.











