‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో.. మాస్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్. దీని తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచించి చేసిన సినిమా ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన రెడ్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే టాకీ పార్ట్ ఈ సంవత్సరం మార్చ్ కే పూర్తయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఎనౌన్స్ చేయలేదు. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, యంగ్ హీరోలు రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. రామ్ ఇంకా ఏ ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు.
కారణం ఏంటంటే.. రామ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. త్రివిక్రమ్.. రామ్ ని కలిసి కథ గురించి చర్చిండం కూడా జరిగిందట. కథ ఓకే.. త్రివిక్రమ్ ఓకే. సినిమా తీయడానికి నిర్మాత స్రవంతి రవి కిషోర్ రెడీ.. అయితే.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం అవ్వడం.. కరోనా వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది కానీ.. లేకపోతే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ సెట్స్ పై ఉండేది. ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతుండడంతో ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ రామ్ తో అ ఆ తరహా కథతో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
అయితే.. ఎన్టీఆర్ మార్చి నుంచి సినిమా స్టార్ట్ చేసేద్దాం.. ఖచ్చితంగా మార్చి నుంచి డేట్స్ ఇస్తానని చెప్పడంతో త్రివిక్రమ్ ఆగినట్టు సమాచారం. రామ్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఇంకా ఆలస్యం అయితే.. త్రివిక్రమ్ తనతోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలా వెయిట్ చేస్తున్నాడట. మరి.. రామ్ నిరీక్షణ ఫలిస్తుందా..? త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే అతని ఆశ నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.