సీనియర్ సినీ పాత్రికేయుడు ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన “రాంగ్ గోపాల్ వర్మ” డిసెంబర్ 4 న విడుదల కానుంది. షకలక శంకర్ టైటిల్ పాత్రలో నటించగా, కత్తి మహేష్, జబర్దస్త్ అభి ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. గతంలో దర్శకుడిగా చక్కటి చిత్రాలు తీసి, .. కొన్నేళ్లుగా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయి, అర్ధ నగ్న, పూర్తి నగ్న సినిమాలు రూపొందిస్తున్న ఓ ప్రముఖ దర్శకుడి వైఖరిపై ప్రభు తీసిన చిత్రమే ఇదని చిత్రబృందం తెలియజేసింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆ బృందం వెల్లడిస్తూ, సదరు దర్శకుడిపై ఘాటైన విమర్శనాస్త్రాలు సందిస్తూ ర్యాప్ రాక్ షకీల్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ పాట విశేషంగా వైరల్ అయ్యిందని తెలిపారు. మరోవైపు ఈ చిత్రంపై ఆసక్తికర చర్చ జరుగుతోందని చెప్పారు. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఎటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Must Read ;– సేవకు వేళాయెరా; అంటున్న షకలక శంకర్!