విభజన అనంతరం ఏపీ లో కాంగ్రెస్ అనే పార్టీ ఉందని జనాలు గుర్తించడం ఎపుడో మానేశారు. ఇక మిగిలింది బిజెపి, జనసేన. ఈ పార్టీల మధ్య పొత్తు పొడిచిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరో ఒకరికే ఛాన్స్. తిరుపతి టికెట్టు కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీ చేరుకున్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మరి టికెట్ దక్కుతుందో లేదో చూడాలి.
ఏపీలో జనసేన ఉనికే లేదు అంటున్న రోజా
పవన్ ఢిల్లీ పయనం పై స్పందించింది అధికార పార్టీ నాయకురాలు రోజా. తిరుపతి టికెట్ ఢిల్లీ వెళితే ఏం వస్తుందని ఎద్దేవా చేసింది. అసలు ఏపీలో జనసేన అనే పార్టీకి ఉనికి లేదని వ్యాఖ్యానించింది. తిరుపతి ప్రజల కష్టాలు వినే వారు ప్రజలకు కావాలని, అంతేకానీ, కనీసం ఎన్నికల్లో నిలబడే విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేని పవన్ లాంటి నాయకుణ్ణి ప్రజలు కోరుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసని, ఎవరు అందుబాటులో ఉంటారో వారు నిర్ణయించుకుంటారని తెలియజేసింది. కనీసం సీటు విషయంలో స్వతహాగా నిర్ణయం తీసుకోలేని పవన్ లాంటి వాళ్లని జనాలు ఆదరించరని చెప్పుకొచ్చారు.
మా అన్న గెలిచాడు… నాకు సీటివ్వండి…
తిరుపతి ఉప ఎన్నిక టికెట్ కోసం పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీ పయనమైన సంగతి తెలిసిందే. అక్కడ ఢిల్లీ పెద్దలను ఒప్పించి తిరుపతిలో బిజెపి పోత్తుతో పోటీ చేయాలనేది జనసేన ఆలోచన. అందుకు వారు చెప్తున్న లాజిక్ వింటే నవ్వురాక మానదు. ప్రజారాజ్యం పెట్టి అప్పట్లో చిరంజీవి తిరుపతి అసెంబ్లీ సీటుని గెలిచిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆయన తమ్ముడినైన నాకు కూడా చిరంజీవిని గెలిపించిన వారు సహకరిస్తారని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ లాజిక్ ఆలోచించాలి అనుకున్న ఇది అసెంబ్లీ పోట కాదు. మరి ఈ లాజిక్ కి ఢిల్లీ పెద్దలు ఏమంటారో చూడాలి?
Must Read ;- జనసేనను నమ్ముకుని.. బరిలో తొడకొడుతున్న బీజేపీ!