జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు రెండూ కూడా ఘాటుగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. దీంతో ఆ రెండు పార్టీల మధ్య విమర్శల స్థాయి ఓ రేంజ్‌కి చేరింది. బీజేపీ వాళ్లకు బిర్యానీ తినిపిస్తామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటరిచ్చారు. అసదుద్దీన్ బీజేపీ వాళ్లకు బిర్యానీ తినిపిస్తాడట.. మేము కూడా అసదుద్దీన్‌కు స్పెషల్ బిర్యానీ తినిపిస్తామన్నాడు. వాల్మీకి సమాజ్ వాళ్లు మా దగ్గర బిర్యానీ బాగా చేస్తారని, ఆ బిర్యానిని అసదుద్దీన్‌కి తినిపిస్తామంటూ రాజాసింగ్ చేసిన వ్మాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభివృద్ది చేసే బీజేపీకే ఓటు వేయాలని ఆయన హిందూవులను, ముస్లీములను విజ్ఞప్తి చేశారు
Muat Read ;- ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని నిలదీసిన మహిళా ఓటరు!