ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో షేన్ వార్న్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.వార్న్ తన విల్లాలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాగా షేన్ వార్న్ మరణం పై అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
షేన్ వార్న్ అసలు పేరు షేన్ కీత్ వార్న్. ఆస్ట్రేలియా తరఫున 1992లో సిడ్నీలో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసిన వార్న్ అంతర్జాతీయ క్రికెట్ లోనే స్పిన్ దిగ్గజంగా పేరొందారు. వార్న్ తన కెరీర్ లో మొత్తంలో 145 టెస్టులు మరియు 194 ODIలు ,73 టీ20 లు ఆడారు.15 ఏళ్ళ సుధీరగా క్రికెట్ కెరీర్ లో వార్న్ వన్డేల్లో 293 వికెట్లు మరియు టెస్టుల్లో 708 వికెట్ల, టీ20 ల్లో 70 వికెట్లు తీశారు.అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా వార్న్ పేరిటే ఉంది. ఇక 2007 లో అంతర్జాతీయ క్రికెట్ కు వార్న్ గూడ బై చెప్పారు.
ఇక 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలవడంలో వార్న్ కీలకపాత్ర పోషించారు.వార్న్ తన నాయకత్వ నైపుణ్యాలకు ఎప్పుడూ గుర్తుండిపోతారు.
అదేసమయంలో వార్న్ కెరీర్ లో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో వివాదాల కారణంగా వార్న్ క్రీడా జీవితం కూడా దెబ్బతింది. వార్న్ తన టోపీపై మరొక ప్రపంచ కప్ రెక్కను కలిగి ఉండేవాడు. 2003 దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ ప్రచారానికి ముందు డ్రగ్ టెస్ట్ లో డోపింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో వార్న్ ఆ సిరీస్ నుంచి తొలగించబడ్డారు.1998లో “మార్క్ వా”తో పాటు బుక్‌మేకర్ నుండి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్న్ కి జరిమానా విధించింది.
షేన్ వారం మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తో పాటు వివిధ దేశాల క్రీడాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. షేన్ ఆరంగేట్రం తర్వాత క్రికెట్ ఆట ఎప్పుడూ ఒకేలా లేదు, ఇప్పుడు అతను పోయిన తర్వాత కూడా అదే విధంగా ఉండదు అంటూ వార్న్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎన్నో సేవలు అందించిన వార్న్ కు గౌరవ చిహ్నంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సదరన్ స్టాండ్‌కు షేన్ వార్న్ పేరు పెట్టనున్నట్లు విక్టోరియా పర్యాటక శాఖ మంత్రి మార్టిన్ పాకుల ప్రకటించారు. వీలైనంత త్వరగా ‘గ్రేట్ సదరన్ స్టాండ్’ పేరును ‘S.K. వార్న్ స్టాండ్’గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. “స్టాండ్‌కి SK వార్న్ స్టాండ్‌గా పేరు పెట్టడం గొప్ప క్రికెటర్‌కి గొప్ప నివాళిగా భావిస్తున్నానని మార్టిన్ పాకుల తెలిపారు. భవిష్యత్తులో ఆ స్టాండ్‌కి ఏమి జరిగినా అది పునర్నిర్మించినా, పునరుద్ధరించబడినా అది శాశ్వతంగా SK వార్న్ స్టాండ్ గానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.