తన భర్త రాజ్ కుంద్రా అరెస్టుపై ఎట్టకేలకు శిల్పశెట్టి స్పందించారు. శృంగారానికీ, బూతుకూ చాలా తేడా ఉందనేది ఆమె వాదన. ఇప్పుడొస్తున్న వెబ్ సిరీస్ లో ఇంతకంటే శృంగారం పాళ్లు ఎక్కువ వస్తోందని, అలాంటప్పుడు తన భర్త తీసే చిత్రాలు పోర్న్ కిందికి రావని ఆమె వాదిస్తోంది. పోలీసుల విచారణకు ముందే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. ‘లుకింగ్ ఎరౌండ్’ అనే పేరుతో ఉన్న పుస్తకంలోని పేజీని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. ఈ పుస్తక రచయిత జేమ్స్ థర్బర్ రాసిన కొటేషన్ ను ఉటంకిస్తూ ‘ఆవేశంలో గతాన్ని, భయంతో భవిష్యత్తునూ చూసుకోవద్దు’ అంటూ హెచ్చిరంచింది. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు భయంతో మనం సహనం కోల్పోతాం’ అని పేరొంది. దాని అంతరార్ధాన్ని మనమే ఊహించుకోవాలి.
పోలీసుల విచారణలో మాత్రం ఆమె ధైర్యంగానే మాట్లాడింది. నిన్న ఆమెను విచారించిన పోలీసులు జుహూలోని వారి ఇంట్లో కూడా సోదాలు జరిపారు. రాజ్ కుంద్రా యాప్ లతో తనకు ఎలాంటి సబంధమూ లేదని అంది. పైగా రాజ్ కుంద్రాను వెనకేసుకొస్తూ ఆమె మాట్లాడింది. హాట్ షాట్ యాప్ లో ఉండే కంటెంట్ లో అశ్లీలత లేదని పేర్కొంది ఆమె ఇంట్లో ఉన్న కంప్యూటర్ లోని హార్డ్ డిస్క్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు మూడు గంటలపాటు శిల్పను పోలీసులు విచారించినట్టు తెలిసింది. రాజ్ కుంద్రా కింద ఉన్న వయాన్ ఇండస్ట్రీస్ కు ఎందుకు రాజీనామా చేశారని కూడా శిల్పాశెట్టిని పోలీసులు ప్రశ్నించారు. రాజ్ కుంద్రా కొందరు మోడల్స్ ను బెదిరించి పోర్న్ వీడియోలు తీసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా పోలీసులు శిల్పకు చెప్పారు. అవి పోర్న్ వీడియోలు అంటే తాను అంగీకరించనని శిల్ప అన్నట్టు తెలిసింది. మొత్తానికి ఈ వ్యవహారం శిల్ప కుటుంబం మొత్తానికీ చుట్టుకునేలా ఉంది.
Must Read ;- హాట్ హిట్ తో రాజ్ ఆదాయం రోజుకు రూ. 10 లక్షలు











