పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ చిత్రం రాధేశ్యామ్. ఈ పిరియాడిక్ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్రను పోషిస్తుండడం విశేషం. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఆంచనాలను అందుకోలేపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ ఎప్పుడు వస్తుందా..? ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రకథలో ఓ సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ దాచి ఉంచారట. అది ప్రేక్షకుల ఊహకు అందని విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంకా చెప్పాలంటే… షాక్ అయ్యేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాధే శ్యామ్ చిత్రంలో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సీన్స్ కు విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చాలా కీలకం. అందుకనే ఈ సీన్స్ చూస్తున్నప్పుడు కొత్త అనుభూతికి లోనయ్యేలా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
ఈ మూవీ టీజర్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచేసింది. యు.వి.క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రభాస్ కూడా అభిమానులు కోరుకున్నట్టుగా ఈసారి అందరికీ నచ్చే సినిమా చేయాలని రాధేశ్యామ్ పై చాలా కేర్ తీసుకుంటున్నాడట. జులై 30న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మరి.. రాధేశ్యామ్ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.
Must Read ;- ప్రభాస్ కు ఇక ఆ అవకాశం లేనట్టే!