మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. అయితే.. ఈ సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి ఆరంభించాలి అనుకున్నారు కానీ.. అది సాధ్యమయ్యేలా లేదు. కారణం ఏంటంటే.. శంకర్ భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కొన్ని కారణాల వలన చాలా సార్లు ఆగింది. ఇక ఈ సినిమా మొత్తానికి ఆగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ సంస్థ తమ సినిమాని పూర్తి చేయకుండా వేరే సినిమాను ఎలా చేస్తారంటూ కోర్టుకెక్కింది. దీంతో శంకర్ భారతీయుడు 2 కంప్లీట్ చేసిన తర్వాతే చరణ్ మూవీని స్టార్ట్ చేయాలి. ఇది జరగడానికి చాలా టైమ్ పట్టచ్చు. అయితే.. చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల పనులు ఆగస్టు నాటికి మొత్తం పూర్తి అవుతాయి. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీ చెయ్యాలనుకున్నాడు కానీ లైకా సంస్థ శంకర్ కి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిడంతో.. భారతీయుడు 2 సినిమా మొత్తం పూర్తి చెయ్యకుండా శంకర్ మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టొద్దనేది లైకా సంస్థ వాదన.
ఈ కేసు మరో మూడు వారాలకు వాయిదా పడింది. దానికి తోడు, శంకర్ కి మరిన్ని కేసులు వచ్చి పడేలా ఉన్నాయి. అందుకే చరణ్ ముందు జాగ్రత్తగా సెకండ్ ఆఫ్సన్ కోసం చూస్తున్నాడని తెలిసింది. కొంత మంది దర్శకులు చెప్పే కథలు వింటున్నాడని తెలిసింది. మరి.. శంకర్ తో సినిమా విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో..?
చరణ్ సెకండ్ ఆఫ్సన్ ప్లాన్ ఫలిస్తుందో..? లేదో..? చూడాలి.
Must Read ;- ‘ఖైదీ’ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ సినిమా ?











