అడ్వకేట్ సిద్దార్ధ్ లూధ్రా.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాజకీయాలలోనే కాదు, దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలోనూ మార్మోగుతోంది.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులో అరెస్ట్ చేసిన నాటి నుండి నిన్న బెయిల్ వచ్చేవరకు సిద్దార్ధ్ లూధ్రాదే హడావిడి అంతా.. చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన నాటి నుండి సిద్దార్ధ్ లూధ్రా అంతా చూసుకున్నారు.. అప్పటినుండి నేటి వరకు ఈ యాభై రోజుల న్యాయ ప్రయాణంలో లూధ్రా మూడే మూడు ట్వీట్‌లు వేశారు. వాటితో ఏపీ రాజకీయాలతోపాటు ఇతర న్యాయపరమైన అంశాలపైనా తీవ్ర చర్చ జరిగింది.. వైసీపీ నేతలు అయితే ఉలిక్కి పడ్డారు..
ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత సిద్దార్ధ్ లూధ్రా సంచలన ట్వీట్ చేశారు.. సిక్కుల పదో గురువు అమర పదాలు అంటూ ఆయన కొటేషన్‌ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ ట్వీట్ ఎంతో వైరల్ అవుతోంది.. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఈ ట్వీట్‌ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు..
తెలివైనవారిలో తెలివైన వాడు.. బలహీనులను రక్షించేవాడు.. నిరంకుశులను నాశనం చేసేవాడు సాత్వికులను కాపాడేవాడు’ అని చంద్రబాబును ఉద్దేశించి లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక వ్యక్తిపై ఆరాధన ఉంటే మినహా.. ఈ స్థాయిలో ట్వీట్‌లు వేయడం సాధ్యం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. గతంలో న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టుకొని యుద్ధం చేయడమే అన్న ట్వీట్.. ఏపీ రాజకీయాలను కుదిపేసింది.. బాబు కేసులో జగన్ టీమ్ ఏదో చేస్తోందన్న అనుమానాలను ఆయన తెరమీదకు తెచ్చారు..
చంద్రబాబు వ్యక్తిత్వంపై సిద్దార్ధ్ లూద్రా చేసిన కామెంట్స్… తెలుగు సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలలో కనిపించే డైలాగుల కంటే పవర్ ఫుల్‌గా ఉన్నాయనే చర్చ మొదలయింది.. కేసుని ఒక లాయర్‌గా వాదిస్తేనే ఇది సాధ్యం కాదని, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని సిద్దార్ధ్ లూధ్రా అంతగా ఆరాధించడం, అభిమానించడంతోనే ఇది సాధ్యం అవుతుందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు..
సిద్దార్ధ్ లూధ్రా ట్వీట్‌లని టీడీపీ కార్యకర్తలు షేర్‌లు చేస్తుంటే, వైసీపీ కార్యకర్తలు హైరానా పడుతున్నారు. వాటిపై నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.. మొత్తమ్మీద, సిద్దార్ధ్ లూద్రా ట్వీట్‌లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.. వైసీపీని కలవరపాటుకి గురి చేస్తున్నాయి…