ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటుంటున్న లెజండరీ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అభిమానులకు ఓ శుభవార్త. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించే పాన్ ఇండియా సినిమాకు స్క్రిప్టు మెంటార్ గా సింగీతం శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి పనిచేయడానికి పలువురు క్రియేటివ్ పీపుల్ ఆసక్తిచూపుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా తెరపైకి వస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాను ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత సి. అశ్వినీదత్ తమ బ్యానర్ లో మరో మరుపురాని చిత్రాన్ని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్నారు.

ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకోనే నటించనుంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేమంటే తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమాపై పనిచేస్తున్న సింగీతం.. క్వారంటైన్ పీరియడ్‌లోనూ చిత్ర బృందంతోనే ఉంటున్నారు. ‘సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నిజమవుతోంది.
‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్‌పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది.’ అని సోషల్ మీడియా ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది. సైన్స్ ఫిక్షన్ జానర్‌కు చెందిన ఈ ఫిల్మ్.. ప్రొడక్షన్‌లో ఉన్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటనేది నిస్సందేహం. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్‌తో, భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మించే చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ ఈ ఎపిక్ ఫిల్మ్‌ను మరింత భారీ వ్యయంతో, దేశవ్యాప్తంగా పేరుపొందిన తారాగణంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.











