విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందని కొన్నాళ్ల క్రితమే చెప్పిన నటుడు, ఉద్యమకారుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో ఓ జర్నలిస్టును ఉద్దేశించి ‘ముసలి కుక్క’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం వ్యాఖ్యలు చేశారంటే.. ‘ అమరావతి ముగిసిన అధ్యాయం అని బీజేపీతో పాటు చాలామంది చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ముగిసిందని 1960ల్లో భావించారని 40 ఏళ్ల తరువాత మళ్లీ తెలంగాణ సాకారమైంది. ఉద్యమాలకు ఉన్న శక్తి అలాంటిదన్నారు. ఈ క్రమంలో ఎవరి అభిప్రాయాలు వారివి అని.. అయితే కొంతమంది ఉద్దేశ పూర్వకంగా ఎదుటివారి అభిప్రాయాలపై ఎదురుదాడి చేస్తున్నారు. అమరావతిని కూడా అలాగే నాశనం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని మాట ఇచ్చారు. ప్రధాని నీళ్లు, మట్టి ఇచ్చినా ఏపీ ప్రజలు సంతోషించారు. అప్పట్లో ప్రధానిని, సీఎంని నమ్మి రైతులు 33వేల ఎకరాలు అమరావతి కోసం ఇచ్చారు. ఇప్పుడు కొందరు మాట తప్పారు. దీక్ష చేస్తున్న మహిళలనూ కామెంట్లు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కూడా రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. నాగార్జునసాగర్‌దీ అదే పరిస్థితి. వేలాది మంది రైతుల త్యాగం. దేశం కోసం, రాష్ట్రాల కోసం భూములు ఇచ్చిన రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా రాజకీయం చేస్తున్నారు. వాళ్లు ఇంజినీరింగ్ చేసినా.. గాడ్ ఇంజినీరింగ్ కచ్చితంగా ఉంటుంది. నేచర్ క్లియర్ చేస్తుంది. హక్కులు అడిగేవారిపై ఎదురుదాడి కరెక్ట్ కాదు. హోదా ఇస్తేనే ఉద్యోగాలొస్తాయని జగన్ కూడా అన్నారు. పోలవరంలో అవినీతి ఉందని ఆరోపించి మళ్లీ పోలవరంపై సానుకూలంగా మాట్లాడుతున్నారు. రైతుల విషయం గ్లోబల్ అవుతుంది. లోకల్ కాదు.
‘వయస్సు ఉడికి ఏపూట పోతామో తెలియక పోయినా’
‘కొంతమంది వయస్సు ఉడికి ఏపూట పోతామో తెలియని కమ్యూనిస్టు ముసుగు వేసుకున్న కొందరు జర్నలిస్టులు ముఖ్యంగా ఓ ముసలి కుక్క..విష ప్రచారం చేశాడు. నువ్వు నాశనం అయిపోతావు.. ఉద్యమానికి కారకుడివి నువ్వు. అద్దం ముందు నుల్చోని ఆత్మపరిశీలన చేసుకో. ఎంగిలి మెతుకులు తినే కుక్కల్ని మాత్రమే నేను అంటున్నా. ఒక్క శాతం మాత్రమే అలాంటి కుక్కలున్నారు. అమరావతికి విషపు పేర్లు పెట్టారు. పుస్తకాలు వేశారు. కలం పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేది ఇలాంటి వాళ్లే. ఒకడి పేరు చెబితే వెంటనే ట్రోల్ చేస్తారు. అలా ఎంగిలి కూడుతో, సంపాదించిన వాటితో భావితరాలు బాగుంటాయని ఎలా అనుకుంటున్నారు. సమాజానికి ఇదేనా ఇచ్చే మెస్సేజ్ అని ప్రశ్నించారు. హావభావాలను కూడా చూపించారు. చేయగలిగితే సాయం చేయాలి’ అని వ్యాఖ్యానించారు.
ఓ వర్గానికి వ్యతిరేకంగా..
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పలుమార్లు ఛానెళ్ల చర్చా వేదికలో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, కొన్ని వర్గాలపై విద్వేషపూరిత మబ్బులు కమ్మిన ‘రవి’కిరణంగా మారి‘గమన’శీలత లేకుండా, అదే శీర్షికతో వ్యాసాలు రాసే వ్యక్తినే శివాజీ అన్నారని ప్రచారం జరుగుతోంది. పదవిరుపులతో ,క్షుద్రవిశ్లేషణలతో అమరావతితోపాటు కొన్ని పక్షాలను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యానించడం సదరు జర్నలిస్టు ముసుగు వేసుకున్న కుఠిలవ్యక్తిగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో సదరు జర్నలిస్టు చేసిన కామెంట్లు, ట్వీట్లు కూడా ఉదహరిస్తున్నారు.
వైసీపీ రెబెల్ ఎంపీ విమర్శ..
కొంత కాలం క్రితం వైసీపీ రెబల్ ఎంపీ సదరు జర్నలిస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ అభిమానిగా మారిపోయారని, అమరావతిలో మహిళలు దీక్షలు చేస్తున్నా, రైతులు ప్రాణాలు కోల్పోతున్నా సదరు జర్నలిస్టుకి కనిపించడం లేదని సదరు ఎంపీ వ్యాఖ్యానించారు. దీనిపై తాను ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పిన సదరు జర్నలిస్టు అమరావతి రైతుల విషయంలో జరిగిందేంటో చెప్పకపోవడంపై పలు ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంగ్లమాధ్యమం ఇష్యూపైనా ఆ జర్నలిస్టు మాట్లాడలేదని సదరు రెబెల్ ఎంపీ వ్యాఖ్యానించగా ఓ కార్యక్రమంలో ‘చెయెత్తి జైకొట్టు తెలుగోడా’ పాట పాడానని చెప్పుకొచ్చారు సదరు జర్నలిస్టు. అదే సమయంలో అమరావతి రైతులకు తాను తొలి నుంచి మద్దతుగా ఉన్నానని, రైతులు అన్యాయమై పోతున్నారనే ఉద్దేశంతోనే తాను అమరావతికి ఓ పేరు పెట్టానని వ్యాఖ్యానించారు. తీరా అమరావతి విషయంలో జరగకూడని నష్టం జరిగాక సదరు జర్నలిస్టు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించడంపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది.
- అమరావతిలో అవినీతి అంటూ ఏవో పత్రికల్లో వచ్చిన కథనాలే శిలాశాసనంగా భావించి వాటి ఆధారంగా విశ్లేషణలు, పుస్తకాలు రాయడాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
- సింగపూర్ దేశంలో అవినీతి లేదా అని ప్రశ్నించిన సదరు జర్నలిస్టు.. పక్కనే ఉన్న చైనా అవినీతిపై తన కెరియర్లో ఇప్పటి వరకు నోరు మెదపని వైనాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు.
- అంతేకాదు.. గతంలో ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్‌పై వార్తలు రాయడంపై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ జర్నలిస్టు..అది అసాధారణ విషయమని వ్యాఖ్యానించారు.
- ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని గతంలో హైకోర్టు చెప్పిందని.. ఎస్‌ఈసీకి సర్వాధికారాలు ఉండవని వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు.
- గతంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం, తరువాత ప్రభుత్వానికి చెప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. SEC ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే రీతిలో పలు క్షుద్ర విశ్లేషణలు కూడా రాశారనే చర్చ నడుస్తోంది.
- నిమ్మగడ్డ రమేష్ వాస్తవిక దృక్పథానికి దూరంగా ఉన్నారనీ వ్యాఖ్యానించారు.
- ఇక పార్లమెంటు నూతన భవనం విషయంలో ఆయన రాసిన వ్యాసాల్లో నూతన పార్లమెంటు భవన నిర్మాణం విషయంలో మోదీ ప్రభుత్వం వాస్తు ను పాటించడాన్ని తప్పుబట్టారు.
ఈ నేపథ్యంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏ జర్నలిస్టుని అన్నాడనే అనివార్య చర్చ మొదలైంది. మరి సదరు జరల్నిస్టు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.











