అఖిల్ హీరోగా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ సక్సెస్ అనే మాటే వినని అఖిల్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో వాళ్లు ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయనకి విజయం దక్కడం ఖయామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఇది ఆయన మార్కుతో సాగే కథేనని అంటున్నారు.

స్టైలీష్ దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. అప్పటివరకూ హీరో కనిపిస్తూ వచ్చిన దానికి భిన్నంగా ఆయన చూపిస్తాడు. ఆయన టేకింగ్ చాలా స్టైలీష్ గా .. డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అఖిల్ జోడీగా కృతి శెట్టిని తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయినట్టేనని ఇప్పుడు అంటున్నారు. అదే నిజమైతే ఈ జోడి అదుర్స్ అనిపించే స్థాయిలోనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘ఉప్పెన’ బ్యూటీ ఇప్పుడు ఫుల్ బిజీ .. ఆమె డేట్లు దొరకడమే కష్టమైపోతోంది. మొదటి సినిమా విడుదలకాకముందే, ఈ అమ్మాయి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే నానీ .. సుధీర్ బాబు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల్ సరసన కూడా ఛాన్స్ దక్కినట్టు చెబుతున్నారు. ఇక ఈ పిల్లను తమ ప్రాజెక్టులలోకి తీసుకోవడానికి ఇక్కడి యంగ్ హీరోలు పోటీ పడుతుంటే, తమిళ యంగ్ హీరోలు కూడా తగవుకి వచ్చేలా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ పిల్లను కళ్లప్పగించి చూస్తూ, వచ్చింది ‘ఉప్పెన’ కాదు .. ఉత్సవం అంటున్నారు. వాళ్ల మాటను మనం ఎలా కాదంటాం?
Also Read: అఖిల్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం?











