అక్షరమే ఆయుధం అంటూ నిజాలను నిర్భయంగా వ్యక్తం చేసే ఆంధ్రజ్యోతిపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ ను రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు కూల్చేశారు. అనుమతులు లేని కారణంగా గోడౌన్ ను కూల్చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారంటూ గోడౌన్ యజమానులు ఆరోపిస్తున్నారు. ‘‘ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి దాదాపు ఐదేళ్లయింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు గత టీడీపీ ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. సమయం ఇవ్వాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోకుండా గోడౌన్‌ను కూల్చివేశారు’’ అని ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెబుతోంది. ఓ పథకం ప్రకారమే అధికారులు ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ ను కూల్చేశారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు.
Must Read ;- ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK